/rtv/media/media_files/2026/02/03/trump-2026-02-03-07-56-01.jpg)
Trump to slash US tariffs on India from 50 percent to 18 percent
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం జరిగింది. వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. ప్రతీకార సుంకాలను 18 శాతం తగ్గిస్తున్నామని పేర్కొన్నారు. అమెరికాపై విధిస్తున్న సుంకాలను సున్నాకు చేర్చేందుకు, రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేందుకు భారత్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్ పెంచిన సంగతి తెలిసిందే. ట్రంప్ తాజా ప్రకటనతో ఈ సుంకాలు 18 శాతానికి తగ్గనున్నాయి.
Also Read: యోగి ఆధిత్యనాథ్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు బ్రేక్
వైట్‌హౌస్ కూడా ఈ అదనపు సుంకాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోదీ కూడా ట్రంప్‌తో సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో దీని గురించి రాసుకొచ్చారు. '' ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను. భారత్‌కు ఆయన శక్తిమంతమైన లీడర్. చాలా విషయాలు మేము మాట్లాడుకున్నాం. వాణిజ్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా, వెనెజువెలా నుంచి భారత్ చమురు కొనుగోలు లాంటి అంశాలపై చర్చలు జరిపాం.
Also Read: యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల బంగారం..వీడియో వైరల్..
అమెరికాకు చెందిన ఉత్పత్తులను కొనేందుకు ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు. 500 బిలియన్ డాలర్లకుపైగా ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులతో పాటు మరిన్ని దిగుమతులకు భారత్ సిద్ధంగా ఉంది. వాళ్లతో మాకున్న సంబంధం ముందుకు సాగనుందని'' ట్రంప్ రాసుకొచ్చారు. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఇకనుంచి భారత్ ఉత్పత్తులపై 18 శాతం అమెరికా సుంకాలే అమలు కానున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ట్రంప్‌కు ధన్యవాదాలు చెప్పారు.
Follow Us