/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
తెలంగాణలో రేపటి నుంచి ప్రైవేటు కళాశాలలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిచింది. మూడు రోజుల్లో రూ.600 కోట్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు బకాయిల కోసం రూ.1500 కోట్లు అడిగినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రూ.600 కోట్లు రిలీజ్ చేశామని.. మరో రూ.600 కోట్లు 3 రోజుల్లో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. మిగతా రూ.300 కోట్లు కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని పేర్కొన్నారు.
Also Read: ఎంపీకి బురుడి.. రూ.56 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
అంతేకాదు ఫీజు రియంబర్స్‌మెంట్‌కు సంబంధించి త్వరలో ఓ కమిటీ వేస్తామని పేర్కొన్నారు. ఎలాంటి సంస్కరణలు చేయాలో కమిటీలోని అధికారులతో పాటు కళాశాల యాజమాన్య ప్రతినిధులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. తమ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేటు కళాశాలలు ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసి మిగతా వాటిని ఆపింది. దీంతో కాలేజీలు నిర్వహించడం కష్టంగా మారిందని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మరోసారి ఆందోళనకు దిగాయి.
Also Read: కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
నవంబర్ 3 నుంచి కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం ప్రైవేటు కళాశాలల యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపారు. ముందుగా రూ.6-00 కోట్లు విడుదల చేసి.. మిగతా రూ.300 కోట్లు త్వరలోనే విడుదల చేస్తామని భట్టీ హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో రేపటి నుంచి ప్రైవేటు కళాశాలలు తెరుచుకోనున్నాయి.
Follow Us