/rtv/media/media_files/2025/10/11/sebastian-lecornu-2025-10-11-12-22-14.jpg)
French Prime Minister Sebastien Lecornu and President Emmanuel Macron
France: ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. ఇక్కడ ప్రధానుల మార్పిడి తరచూ చోటుచేసుకుంటోంది. ఈ ఏడాదిలో ఐదుగురు ప్రధానమంత్రులు మారడాన్ని చూస్తే అక్కడి రాజకీయ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు అత్యంత సన్నిహితుడైన సెబాస్టియన్ లెకోర్నుకు (39) ప్రధానిగా బాధ్యతలు అప్పగించారు. అయితే నాలుగు రోజుల క్రితం కేబినెట్ ఏర్పాటు అనంతరం లెకోర్ను ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన మంత్రివర్గం లో తీసుకున్న వారిపట్ల ఉన్న వ్యతిరేకత, ప్రతిపక్షాల నుంచి వచ్చిన నిరసనతో పాటు మద్దతుదారులు బెదిరింపుల మధ్య తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఇంతలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సెబాస్టియన్ లెకోర్నుకు మద్దతు పలుకుతూ, తిరిగి ఆయనను ప్రధానిగా నియమించడం విశేషం. అంతేకాక ప్రభుత్వ ఏర్పాటు చేసే బాధ్యతను కూడా ఆయనకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయంశంగా మారింది.
నిజానికి సెబాస్టియన్ లెకోర్ను రాజీనామా చేసిన అనంతరం మరోకరికి అవకాశం వస్తందని అందరూ అనుకున్నారు.ప్రతిపక్షాలు కూడా నూతన ప్రధాని కోసం ఎదురు చూశాయి. అయితే దీనికి భిన్నంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం వారిని అందర్నీ ఆశ్చర్యపరిచింది. దేశంలో ఇప్పటికే రాజకీయ సంక్షోభం ఏర్పడటం, ప్రతిపక్షాల నుంచి నిరసనల నేపథ్యంలో దీన్ని చక్కదిద్దాలని భావించిన మాక్రాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే లెకోర్నును తిరిగి ప్రధానిగా నియమించడంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా మిత్రపక్షాలు సహకరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం మరోమారు ఇబ్బందుల్లో పడే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత ఏడాదికాలంగా ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ రాక హంగ్ పార్లమెంట్ ఏర్పడిన కారణంగా ప్రభుత్వం పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
గత నెల 9న ఫ్రాన్స్ ప్రధానిగా లెకోర్ను నియమితులయ్యారు. అయితే మంత్రివర్గం ఏర్పాటు విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. కాగా నాలుగు రోజులకే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరిగి లెకోర్నును అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది మాక్రాన్ సొంతంగా అధికారాన్ని చేజిక్కించుకుంటారని భావించినప్పటికీ, హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. నాటి నుంచి ఫ్రాన్స్ రాజకీయ ప్రతిష్టంభనలో కొట్టుమిట్టాడుతోంది. పొదుపు బడ్జెట్‌పై కొనసాగుతున్న ప్రతిష్ఠంభన ముగించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు ప్రధానిగా కొత్త వ్యక్తిని కోరుకున్నారు. కానీ, దానికి భిన్నంగా లెకోర్ను తిరిగి ఇదే పదవిలో నియమితులయ్యారు. ‘రిపబ్లిక్ అధ్యక్షుడు మాక్రాన్ తిరిగి లెకోర్నును ప్రధానిగా నామినేట్ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు’ అని ఎలీసీ ప్యాలెస్ మీడియాకు ప్రకటన విడుదల చేసింది.
ఈ విషయమై లెకోర్ను మాట్లాడుతూ తాను విధి లేని పరిస్థితుల్లో ఈ బాధ్యతకు అంగీకరించానని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఫ్రాన్స్‌కు బడ్జెట్ అందించేందుకు నా వంతు సాధ్యమైనంతవరకు కృషి చేస్తానని తెలిపారు. 2017లో అధ్యక్ష పదవిని చేపట్టినప్పటినుంచే మాక్రాన్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కాగా ఈ విషయమై ఫ్రెంచ్ జాతీయ ర్యాలీ పార్టీ నేత జోర్డాన్ బార్డెల్లా మాట్లాడుతూ ప్రధానిగా తిరిగి లెకోర్నును నియమించడాన్ని జోక్‌గా అభివర్ణించారు.
Also Read: Rashmika: రష్మిక చేతికి పెద్ద డైమండ్ ఉంగరం..ఎంగేజ్ మెంట్ నిజమే అంటున్న అభిమానులు