Surya Ghar Scheme: సూర్యఘర్‌ స్కీమ్‌తో 7.71 లక్షల కుటుంబాలకు నో కరెంట్ బిల్లు

రూఫ్‌టాప్‌ సోలార్‌ను విస్తరించాలనే లక్ష్యంతో గతేడాది తీసుకొచ్చిన పీఎం సూర్యఘర్‌ ముఫ్త్ బిజీలీ యోజన స్కీమ్‌ ప్రయోజనాలు అందిస్తోంది. ఈ స్కీమ్‌ కింద దేశవ్యాప్తంగా 24.35 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. వీళ్లలో 7.7 లక్షల కుటుంబాలకు జీరో బిల్లు వచ్చింది.

New Update
Govt says 7.71 lakh households got zero electricity bills under PM's Muft Bijli Yojana

Govt says 7.71 lakh households got zero electricity bills under PM's Muft Bijli Yojana

Surya Ghar Scheme: రూఫ్‌టాప్‌ సోలార్‌ను విస్తరించాలనే లక్ష్యంతో గతేడాది తీసుకొచ్చిన పీఎం సూర్యఘర్‌ ముఫ్త్ బిజీలీ యోజన స్కీమ్‌ ప్రయోజనాలు అందిస్తోంది. ఈ స్కీమ్‌ కింద దేశవ్యాప్తంగా 24.35 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. వీళ్లలో 7.7 లక్షల కుటుంబాలకు జీరో బిల్లు వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పింది. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్‌ మంగళవారం రాజ్యసభలో దీనిపై లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2024 ఫిబ్రవరిలో కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2026-27 నాటికి మొత్తం కోటి కుటుంబాలకు రూఫ్‌టాప్‌ సోలార్‌ను అందించడమే దీని టార్గెట్. 

Also Read: కాలుష్యం కారణం శ్వాసకోశ సమస్యలు.. నివారణకు ఇంటి చిట్కాలు

2025 డిసెంబర్ 9 నాటికి ఈ స్కీమ్‌ కింద 19.45 లక్షల రూఫ్‌టాప్‌ సోలార్‌ సిస్టమ్‌లు ఏర్పాటు అయ్యాయని మంత్రి తెలిపారు. 24,35,196 కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందన్నారు. ఇప్పటిదాకా 7,71,580 కుటుంబాలకు జీరో బిల్లు వచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర సాయం కింద రూ.13,926.25 కోట్లు రిలీజ్‌ అయ్యాయని తెలిపారు. 8,30,617 దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఈ పథకంలో చేరేందుకు గృహ వినియోగదారులందరూ కూడా అర్హులే. ఒక్కసారి ఈ రూఫ్‌టార్ సోలార్ ప్యానళ్లు పెట్టుకుంటే 25 ఏళ్ల వరకు గ్యారెంటీ ఉంటుంది.     

Also Read: భారీగా H-1B, H-4 వీసాలు ‘రద్దు’..ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్

ఒక కిలోవాట్ ప్లాంట్ పెడితే రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు లేదా అంతకంటే ఎక్కువ కిలోవాట్ ప్లాంటు అయితే రూ.78 వేలు అందిస్తారు. ఉదాహరణకు ఎవరైనా 3 కిలోవాట్ల యూనిట్‌ను పెట్టుకుంటే రూ.2.30 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో రూ.78 వేలు రాయితీ కింద వస్తుంది. మిగిలిన డబ్బును బ్యాంకుల నుంచి లోన్‌గా తీసుకోవచ్చు.  10 ఏళ్ల వరకు వాయిదాల పద్ధతిలో కట్టుకోవచ్చు. ఒకవేళ మిగులు యూనిట్లు ఉంటే వాటిని విద్యుత్ శాఖే వాటిని అమ్ముతుంది. దాని నుంచి వచ్చిన డబ్బుతో కూడా చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌ గురించి మరిన్ని వివరాల కోసం పీఎం సూర్యఘర్‌ (pmsuryaghar.gov.in) వెబ్‌సైట్‌ను సందర్శించారు. 

Advertisment
తాజా కథనాలు