/rtv/media/media_files/2025/05/15/LmGOaOuwDI44Z8vEDGW7.jpg)
Donald Trump
భారత్‌తో ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే ఈ పెద్ద డీల్ కార్యరూపం దాల్చవచ్చని ఆయన గురువారం వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. కొన్నివారాల క్రితం ఇరు దేశాల వాణిజ్య ప్రతినిధుల మధ్య ఢిల్లీలో చర్చలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైట్‌హౌస్‌లో జరిగిన బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్ లో భారత్‌తో ఒక గొప్ప ఒప్పందం రాబోతోందని ట్రంప్ తెలిపారు. ఇటీవలే చైనాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని గుర్తుచేసిన ఆయన, తదుపరి భారీ ఒప్పందం భారత్‌తోనే ఉండొచ్చన్నారు.
Also Read : జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట
America Trade Deal With US
#1 - President Trump just announced the US has signed a trade deal with China.
— The Vigilant Fox 🦊 (@VigilantFox) June 26, 2025
Huge! The legacy media have been telling us this was impossible.
And INDIA is next, Trump says.
Credit: @nicksortor pic.twitter.com/qIDXhJnfbm
Also Read : మరో ఎయిర్ ఇండియా విమానంలో బాంబు..!
జూన్ 10న ముగిసిన నాలుగు రోజుల సమావేశాల్లో ఇరు దేశాల ప్రతినిధులు రహస్యంగా చర్చలు జరిగాయి. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సౌకర్యం కల్పించడం, సుంకాల తగ్గింపు, ఇతర వాణిజ్య అవరోధాల తొలగింపు వంటి అంశాలపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అమెరికా తరఫున ఆ దేశ వాణిజ్య ప్రతినిధి కార్యాలయ అధికారులు, భారత్ తరఫున వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన రాజేశ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 190 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని సమాచారం.
Also Read : మరి కాసేపట్లో స్క్విడ్ గేమ్ ఆఖరి పోరు! ఇండియాలో స్ట్రీమింగ్ టైమ్ ఇదే
Also Read : రాజ్‌తరుణ్-లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఊహించని షాకిచ్చిన హైకోర్టు
47th us president donald trump | US india trade | america trade deal with US