Trump: నేను లేకుంటే పాక్ ప్రధాని ఎప్పుడో చనిపోయేవాడు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్

భారత్-పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ గురించి ప్రస్తావిస్తూ ట్రంప్ నోరుజారారు. "నేను గనుక జోక్యం చేసుకోకపోయి ఉంటే పాకిస్థాన్ ప్రధాని పదవి ఎప్పుడో పోయేది" అని అనడం చర్చనీయాంశమైంది. తాను 8 యుద్దాలు ఆపానని ట్రంప్ మళ్లీ ఈ వేదికపై చెప్పుకున్నాడు.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2026 'స్టేట్ ఆఫ్ ది యూనియన్' ప్రసంగంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రసంగం మధ్యలో భారత్-పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ గురించి ప్రస్తావిస్తూ ట్రంప్ నోరుజారారు. నేను గనుక జోక్యం చేసుకోకపోయి ఉంటే పాకిస్థాన్ ప్రధాని చనిపోయి ఉండేవాని అని ట్రంప్ అనడం చర్చనీయాంశమైంది. తాను 8 యుద్దాలు ఆపానని ట్రంప్ మళ్లీ ఈ వేదికపై చెప్పుకున్నాడు. ట్రంప్ శాంతి చర్చలు జరపకుంటే ఇండియా దాడుల్లో పాక్ ప్రధాని చనిపోయి ఉండేడని ఆయన అన్నారు. అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇండియా చేసిన ఆపరేషన్ సిందూర్‌లో దాదాపు 35 మిలియన్ల మంది చనిపోయి ఉండేవారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనతో చెప్పారని ట్రంప్ అన్నారు.

టారిఫ్‌ల తీర్పుపై ఫైర్

ముఖ్యంగా వాణిజ్య టారిఫ్‌ల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కోర్టు తీర్పు దురదృష్టకరమని పేర్కొన్న ఆయన, రూలింగ్ ఎలా ఉన్నా సరే.. ఇతర మార్గాల ద్వారా టారిఫ్‌లను అమలు చేసి తీరుతామని కుండబద్ధలు కొట్టారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందే ఆయన వేదికపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి వచ్చారు. వాషింగ్టన్‌లోని యునైటెడ్ స్టేట్స్ కాపిటల్ హౌస్ చాంబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

తన పాలనలో సాధించిన అమెరికా ఆర్థిక ప్రగతిని ట్రంప్ గోల్డన్ ఏజ్‌గా అభివర్ణించాడు. ఐదేళ్ల కాలంలోనే ద్రవ్యోల్బణాన్ని అత్యంత కనిష్ట స్థాయికి తీసుకువచ్చామని, తన కార్యవర్గం తొలి ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు. అలాగే వెనెజువెలా నుంచి 80 మిలియన్ బ్యారెళ్ల చమురు అమెరికాకు చేరుకుందని చెప్పారు. అమెరికాను పట్టిపీడిస్తున్న అక్రమ వలసలు, ఫెంటనిల్ (మత్తు పదార్థం) సరఫరాపై మున్ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రయోజనాలే పరమావధిగా తన పాలన కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

Advertisment
తాజా కథనాలు