Trump: అమెరికాకు వ్యతిరేకంగా ఆ దేశాల కుట్ర.. భయపడుతున్న ట్రంప్!

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ పై చైనా విజయాన్ని పురస్కరించుకుని సైనిక ప్రదర్శనను నిర్వహించారు. దీనికి రష్యా, ఉత్తర కొరియా సహా దాదాపు 25 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ముగ్గురు నాయకులు కలిసి అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ట్రంప్ ఆరోపించారు.

New Update
Trump

Trump

చైనా రాజధాని బీజింగ్‌లో ఇటీవల జరిగిన ఆర్మీ పరేడ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కవాతులో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒకే వేదికపై కనిపించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ముగ్గురు నాయకులు కలిసి అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ట్రంప్ ఆరోపించారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ పై చైనా సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ సైనిక ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రష్యా, ఉత్తర కొరియా సహా దాదాపు 25 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌తో పాటు పుతిన్, కిమ్ ఒకే వేదికపై నిలబడి కవాతును వీక్షించడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. దీనిపై ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, "అమెరికాకు వ్యతిరేకంగా మీరు కుట్ర పన్నుతున్నప్పుడు, పుతిన్‌కు, కిమ్‌కు నా శుభాకాంక్షలు తెలియజేయండి" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ట్రంప్ తన పోస్ట్‌లో, రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ నుండి చైనాకు స్వాతంత్ర్యం కల్పించడానికి అమెరికా సైనికులు చేసిన త్యాగాలను గుర్తు చేశారు. "చైనా విజయం కోసం చాలా మంది అమెరికన్లు తమ రక్తాన్ని ధారపోశారు. వారి ధైర్యం, త్యాగాలను జిన్‌పింగ్ గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను" అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను సూచిస్తున్నాయి. పుతిన్, కిమ్‌, జిన్‌పింగ్ సమావేశంతో ట్రంప్ Xలో ఆందోళన వ్యక్తం చేశాడు. రెండో ప్రపంచయుద్ధంలో చైనా కోసం.. అమెరికా పోరాడిందని ట్రంప్ గుర్తు చేశారు. మా సైనికుల త్యాగాలను చైనా మర్చిపోవద్దని ట్వీట్‌లో పేర్కొన్నారు ట్రంప్. 

రష్యా, చైనా, ఉత్తర కొరియా మధ్య సైనిక, ఆర్థిక సహకారం ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. ఇది అమెరికాతో ఈ దేశాల సంబంధాలను మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ సైనిక కవాతులో చైనా తమ అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శించి, తమ సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ముఖ్యంగా తమ కొత్త క్షిపణులు, యుద్ధ విమానాలను తొలిసారిగా ప్రదర్శనలో ఉంచింది. ఈ పరిణామాలు ప్రపంచ భద్రతకు కొత్త సవాలుగా మారుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా స్పందిస్తూ, ట్రంప్ వ్యంగ్యంగా మాట్లాడారని, తాము ఎలాంటి కుట్రలు పన్నడం లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ ముగ్గురు నాయకుల కలయిక ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త సమీకరణకు నాంది పలికిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకి కిమ్ సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌‌లోని క్రస్క్ స్వాధీనానికి.. కిమ్ రష్యాకి 11000 మంది సైనికులను పంపాడు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కి అమెరికా బహిరంగంగానే మద్దతు ఇస్తోంది.

Advertisment
తాజా కథనాలు