/rtv/media/media_files/2025/07/11/usa-ukraine-2025-07-11-08-30-32.jpg)
USA-Ukraine
ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా నిలిపివేయాలని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అమెరికా నిల్వలు తగ్గిపోతున్నాయనే ఆందోళనల కారణంగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ గత వారం తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు. ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడుల తర్వాత క్షిపణి రక్షణకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిన సమయంలో నిలిపివేత జరిగినట్లు చెప్పారు.
రష్యా మాట వినకుండా దాడులను తీవ్రతరం చేయడంతోనే..
అయితే తాజాగా ఇందుకు విరుద్ధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా ఆపలేదు అంటూ చెప్పారు. 155 మి.మీ. ఆర్టిలరీ షెల్స్, GMLRS ప్రెసిషన్ రాకెట్లు తిరిగి ఉక్రెయిన్ దళాలకు పంపిస్తామని తెలిపారు. దీనిపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రంప్ తనతో సంప్రదించకుండా ఆయుధాల సరఫరాను ప్రకటించారని చెప్పారు. అయితే అధ్యక్షుడు ఆదేశాలు మటుకు అమలు చేస్తామని అన్నారు.
మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడులను తీవ్రతరం చేయడంతోనే అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకునట్లు చెబుతున్నారు. ఎంత చెప్పినా రష్యా ఎవరి మాటా వినడం లేదని...అందుకు ఉక్రెయిన్ కు మళ్ళీ సాయంగా నిలబడాలని అనుకున్నారని అంటున్నారు. ఉక్రెయిన్ 500కు పైగా డ్రోన్లు, క్షిపణులతో రష్యా వైమానిక దాడులను భారీగా ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఆయుధాల సరఫరా పునరుద్ధరణ జరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మానవ హక్కుల ఉల్లంఘనలపై అసమ్మతి వ్యక్తం చేస్తూ ట్రంప్ వ్యక్తిగతంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని వైట్ హౌస్ సమర్థించింది. ఉక్రెయిన్ ఆత్మరక్షణకు మద్దతుగా నిలవడం చాలా అవసరమని వెల్లడించింది.
Also Read: USA: సిటిజెన్ షిఫ్ విషయంలో ట్రంప్ కు చుక్కెదురు..ఆదేశాలు నిలిపివేత