USA: సిటిజెన్ షిఫ్ విషయంలో ట్రంప్ కు చుక్కెదురు..ఆదేశాలు నిలిపివేత

అమెరికాలో ఉంటున్న ఇతర దేశస్థుల పిల్లలకు ఇచ్చే సిటిజెన్ షిప్ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ కు చుక్కెదురు అయింది. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు నిలిపివేయాలని ఆదేశించింది. 

New Update
Trump

Trump

వందేళ్ళ నుంచి అమెరికాలో పుట్టిన ఇతర పిల్లలకు సిటిజెన్‌ షిప్‌ను ఇస్తోంది అమెరికా ప్రభుత్వం. ఇది చాలా దేశాల వారికి బెనిఫిషియల్‌గా ఉండేది. ముఖ్యంగా భారతీయులు అమెరికాలో పిల్లను కనేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అమెరికా సిటిజెన్ షిప్ ఉంటే పిల్లలు చదువులకు, వాళ్ళ సెటిల్ మెంట్‌కు మంచి అవకాశాలుంటాయి. అమెరికా పౌరుల కింద పరిగణించబడతారు కాబట్టి వారికి కూడా అ దేశంలో ఇచ్చే సదుపాయాలు అన్నింటికీ అర్హులవుతారు. అందుకే అమెరికా సిటిజెన్ షిప్‌కు అంత ప్రాముఖ్యత ఉంది. దీనిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేస్తూ కార్య నిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. 

ఉత్తర్వులను నిలిపేయాలి..

ఈ సిటిజెన్ షిప్ క్యాన్సిల్ ఉత్తర్వులను న్యూహాంప్‌షైర్‌ ఫెడరల్‌ జడ్జి జోసెఫ్‌ లా ప్లాంటీ నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు. అమెరికా మొత్తం ఈ తీర్పు వర్తిస్తుందని చెప్పారు. దీనిపై అప్పీలుకు వీలుగా ఏడు రోజులపాటు స్టే ఇచ్చారు. దీంతో పాటూ మరి కొన్ని రోజుల్లో ఈ కేసు విచారణ అమెరికా సుప్రీంకోర్టులో కూడా విచారణకు రానుంది. ఫెడరల్‌ జడ్జి నిర్ణయంతో సిటిజెన్ షిప్ కేసు త్వరితగతిన విచారణ అవుతుందని తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు