TIK TOK: అమెరికాకు మళ్ళీ టిక్ టాక్..యువత ఆనందంగా ఉంటారన్న ట్రంప్

అమెరికాలో టిక్ టాక్ మళ్ళీ వస్తోంది. దీనిపై చైనా, అమెరికాలో తొందరలోనే ఒక ఒప్పందానికి రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ తో మాట్లాడతానని..యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు.

New Update
Donald Trump extends China tariff deadline by 90 days

Donald Trump extends China tariff deadline by 90 days

ఈ ఏడాది జనవరి నుంచి అమెరికాలో టిక్ టాక్ బంద్ అయింది. అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలతో యాప్ సేవల్ని నిలిపేసింది ప్రభుత్వం. టిక్ టాక్ బ్యాన్ కు సంబంధించి అమెరికా ప్రతినిధుల సభలో ఓ బిల్లుకు ఆమోదం కూడా తెలిపింది. చైనా యాజమాన్యం దాన్ని వదులుకోవాలని...లేకపోతే పూర్తి నిషేధం ఎదుర్కుంటారని యూఎస్ హెచ్చరించింది. అయితే చైనా దాన్ని వదులుకోలేదు. దాంతో యాప్ ను బ్యాన్ చేసింది. మధ్యలో టిక్ టాక్ యాప్ ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీసుకుంటారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అది కూడా జరగలేదు. ఈ యాప్ అమెరికా యూజర్ల డేటాను దాని మాతృ సంస్థ అయిన 'బైట్ డాన్స్' ద్వారా చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందని అగ్రరాజ్యం ప్రధాన ఆరోపణ.

టిక్ టాక్ బ్యాన్ పై మంతనాలు..

అయితే ఇప్పుడు ట్రంప్ యంత్రాంగం మళ్ళీ టిక్ టాక్ బ్యాన్ ను ఎత్తేయాలని ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి మంతనాలను జరుపుతోంది. ఈ విషయమై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో మాట్లాడతానని ట్రంప్ చెప్పారు. టిక్ టాక్ మళ్ళీ వస్తే అమెరికా యువత చాలా సంతోషిస్తుందని అధ్యక్షుడు కామెంట్ చేశారు. అందుకే దాన్ని మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నామని చెప్పారు. దాంతో పాటూటిక్ టాక్ ద్వారా యూఎస్ యూత్ ఎంత ఆదా చేసుకోవచ్చు...చేసుకోవాలి అనే నిబంధనలపై కూడా కంపెనీతో ఒప్పందం చేసుకుంటామని ట్రంప్ చెప్పారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. టారీఫ్ లు, వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా జరిగిన చర్చల్లో టిక్ టాక్ యాప్ పై కూడా ఒక ఫ్రేమ్ వర్క్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్బెసెంట్ తెలిపారు.

ఈ ఒప్పందం ప్రకారం టిక్ టాక్ ను అ మెరికాలో కొనసాగించనున్నారు. లేకపోతే పెస్టెంబర్ 17 నాటికి అది శాశ్వతంగా మూతపడుతుందని స్కాట్ తెలిపారు. చైనా తమ సుంకాలు , వాణిజ్య ఒప్పందాల్లో రాయితీలు ఇవ్వకపోతే టిక్ టాక్ పై బ్యాన్ తప్పదని ఆయన హెచ్చరించారు. వీటిపై రాబోయే రెండు , మూడు రోజుల్లో మరిన్ని చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు జరిగిన టాక్స్ లో మనీలాండరింగ్, అక్రమ ఫెంటానిల్ ను అరికట్టే విషయంపై ఇరు దేశాలు మాట్లాడుకున్నాయి.

Advertisment
తాజా కథనాలు