/rtv/media/media_files/2025/04/07/ZiNIQ58PLtC2nsWBsRtG.jpg)
Bill gates
ప్రపంచం చాలా మారిపోయింది. టెక్నాలజీ రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఏఐ వచ్చాక పరిస్థితులు అంతా తల్లకిందులు అయిపోయాయి. అన్ని పనులూ ఏఐ చేసేస్తుండడంతో చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయి. ఇదే విషయాన్ని టెక్ అధిపతి, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ కూడా హెచ్చరిస్తున్నారు. మరో నాలుగు, ఐదేళ్ళల్లో వైట్ కాలర్ జాబ్స్ అన్నీ పోతాయని చెబుతున్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాల సందర్భంగా ఆయన భారత్‌కు చెందిన జాతీయ మీడియాతో మాట్లాడారు. దీనిలో ఏఏఐకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊహించిన దానికంటే వేగంగా జాబ్ మార్కెట్ రూపాన్ని మార్చబోతోందని చెప్పారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ప్రొడక్టివిటీ పెరిగిందని, లాజిస్టిక్స్, కాల్ సెంటర్స్‌లో ఏఐ లోయర్ స్కిల్ రోల్స్‌ను రీప్లేస్ చేస్తోందని బిల్ గేట్స్ అన్నారు. దీని వలన వైట్ కాలర్, బ్లూ కాలర్ జాబ్స్ కూడా పోతాయని చెప్పారు.
సంపద ఒకరి చేతిలోకే..
ఏఐ ఇప్పటికే చాలా చేస్తోంది. దీని వలన వ్యాధుల నిర్థారణ, నివారణ కూడా అవుతున్నాయి. అసలు విద్యా విధానంలోనే విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇది ఎన్నో మార్పులకు దారి తీస్తుంది. ప్రభుత్వాలు దీనిని పట్టించుకోవడం లేదు. ఏఐపై సరైన నియంత్రణ లేకపోతే ఉద్యోగ వ్యవస్థలు, నియామక విధానాలు, ఆర్థిక సమానత్వంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని బిల్ గేట్స్ అన్నారు. ‘ది ఇయర్ అహెడ్’ లేఖలోనూ బిల్ గేట్స్ ఇవే విషయాలను ఆయన ఉటంకించారు. ఇప్పటి వరకు చూసింది చాలా తక్కువ...కానీ త్వరలోనే ఊహించని పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఏఐ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ప్రొడక్టివిటీ పెరిగిందని, లాజిస్టిక్స్, కాల్ సెంటర్స్‌లో ఏఐ లోయర్ స్కిల్ రోల్స్‌ను రీప్లేస్ చేస్తోందని అన్నారు. దీన్ని సవరించక పోతే సంపద కొద్ది మంది చేతుల్లోకి మాత్రమే వెళ్ళిపోతుందని బిల్ గేట్స్ హెచ్చరించారు. అసమానతలు తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే సమిష్టి విధానాలు, అంతర్జాతీయ సహకారం అవసరమని తెలిపారు.
Follow Us