Explainer: నాడు పాక్, నేడు వెనెజువెలా.. చైనా వెపన్స్ మళ్లీ ఫెయిల్.. కారణం ఏంటి?

మావి అత్యంత శక్తివంతమైనవి చెప్పుకున్న చైనా ఆయుధాలు మళ్ళీ ఫెయిల్ అయ్యాయి. ఆపరేషన్ సింధు టైమ్ లో పాకిస్తాన్ ఇవే ఆయుధాలతో ఫెయిల్ అయితే..ఇప్పుడు వెనెజువెలా కూడా అమెరికాను ఎదుర్కోవడానికి చైనా ఆయుధాలనే ఉపయోగించి బొక్క బోర్లా పడింది. 

New Update
china wepons

చైనా ఆయుధాలు మరోసారి దెబ్బ తీశాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవని బిల్డప్ ఇచ్చిన చైనా వెపన్స్ అమెరికా ఆయుధాల మందు తుస్సుమన్నాయి. అంతకు ముందు ఆపరేషన్ సింధు సమయంలో కూడా పాకిస్తాన్ ఇవే ఆయుధాలను ఉపయోగించి చేతులు కాల్చుకుంది. ఇప్పుడు వెనెజువెలా కూడా అదే పరిస్థితిని ఎదుర్కోంటోంది. వెనెజువెలా  పతనం తర్వాత చైనా ఆయుధాల గురించి పెద్దగా డిస్కషన్జరగకుండా ఆ దేశం తప్పించింది కానీ..నిజానికి ఇది చాలా పెద్ద విషయమనే చెప్పాలి. 

యుద్ధ రంగంలో ‘డ్రాగన్‌ టెక్నాలజీ’ అని చైనా గొప్పగా చెప్పుకునే ఆయుధాలు మరో సారి దారుణంగా బొక్క బోర్లా పడ్డాయి.  పాక్‌ భూభాగంలోనూ, వెనెజువెలా ఘటనల్లోనూ చైనా సరఫరా చేసిన ఎయిర్‌ డిఫెన్స్‌ డిస్టమ్ ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయింది. చైనా ఆయుధాలు తక్కువ ఖర్చుతో, అధిక సామర్థ్యంతో ఉంటాయని తెగ ప్రచారం జరిగింది కానీ..నిజం ఏంటంటే.. నిజమైన యుద్ధ పరిస్థితుల్లో అవి నిలబడలేకపోతున్నాయి.  చైనా ఆయుధ వ్యవస్థలనే నమ్ముకున్న వెనెజువెలా అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది. ఏకంగా అధ్యక్షుడినే కోల్పోవాల్సి వచ్చింది. అంతకు ముందు ఆపరేషన్ సింధు సమంలో భారత క్షిపణులు వరుసగా పాకిస్తాన్ వైమానిక శిబిరాలను ధ్వంసం చేస్తుంటే...పాక్ సైన్యం ప్రయోగించిన చైనా ఆయుధాలు పనిచేయలేక చేతులెత్తేసాయి. ఇప్పుడు కూడా చైనా ఆయుధాలు వెనెజువెలా యుద్ధాన్ని కాదు కదా చివరకు అమెరికా ఆపరేషన్‌ను సైతం అడ్డుకోలేకపోయింది.

అసలు రక్షణ వ్యవస్థ ఉందా?

వెనెజువెలా దాదాపుగా పది ఏళ్ళ నుంచి చైనా ఆయుధాలపైనే ఆధారపడి ఉంది. పాకిస్తాన్ కు అందించినట్టే డ్రాగన్ కంట్రీ వెనెజువెలాకు కూడా తన అత్యాధునిక ఆయుధాలను అందించింది. అయితే అమెరికా డెల్టా ఫర్స్ నిర్వహించిన ఆపరేషన్‌ అబ్జల్యూట్‌ రిజాల్వ్‌...చనా అధునాతన రక్షణ వ్యవస్థల డొల్లతనాన్ని బయటపెట్టింది. తాము తయారు చేసిన జేవై-27ఏ, జేవైఎల్-1 రాడార్లు శత్రు విమానాలను, అమెరికాకు చెందిన ఎఫ్​-22, ఎఫ్​-35 వంటి స్టెల్త్ యుద్ధ విమానాలను కూడా గుర్తిస్తాయని చైనా చాలా గొప్పగా ప్రచారం చేసుకుంది. కానీ అసలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. వెనెజువెలా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైనది జేవై-27ఏ రాడార్. ఇది చైనా గొప్పగా చెప్పుకున్న వ్యవస్థే. అయితే తాజా దాడుల్లో అమెరికా విమానాలు, హెలికాఫ్టర్లను మాత్రం గుర్తించలేకపోయింది. వెనెజువెలా గగనతలంలో అమెరికా విమానాలు ప్రవేశించినా...కారకస్ లో శుభ్రంగా తిరిగేసినా కూడా పసిగట్టలేకపోయింది. దీంతో చైనా రక్షణ వ్యవస్థ డొల్లతనం మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది. చైనా రాడార్ సాంకేతికతలోని లోపాలను ప్రపంచానికి చాటిచెప్పిందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు చెబుతున్నారు.

డొల్ల రక్షణ వ్యవస్థ..

అలాగే వెనెజువెలా రాజధాని కరకస్ చుట్టూ చైనా తయారు చేసిన నిఘా నెట్ వర్క్ ను ఏర్పాటు చేశారు. దీన్ని కూడా అమెరికా చాలా ఈజీగా హ్యాక్ చేసేసింది. చైనా టెక్నాలజీలో ఉన్న బ్యాక్-డోర్ లోపాలను అమెరికన్ సైబర్ విభాగాలు చీల్చి చెండాడేశాయి. దాంతో అమెరికా దళాల కదలికలను గుర్తించడంలో చైనా సెన్సార్లు, కెమెరాలు దారుణంగా విఫలం అయ్యాయి. సరే పనీ రక్షణ వ్యవస్థ ఫెయిల్ అయింది...కనీసం యుద్ధ విమానాలు అయినా పనికొచ్చాయా అంటే అది కూడా లేదు. వెనెజువెలా వైమానిక దళం కోసం చైనా నుంచి కొనుగోలు చేసిన కె-8 కారకోరం యుద్ధ విమానాలు ఏమాత్రం ప్రతిఘటించలేకపోయాయి. అమెరికా చేపట్టిన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ దాడుల వల్ల ఈ విమానాల కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా మొరాయించాయి. ఫలితంగా అమెరికా హెలికాప్టర్లు ఎటువంటి ఆటంకం లేకుండా డెల్టా ఫోర్స్ దళాలను వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురో ఉన్న ప్రాంతానికి చేర్చగలిగాయి. 

అంతకు ముందు పాకిస్తాన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. డ్రాగన్ కంట్రీని గుడ్డగా మ్మి చైనా తయారు చేసిన హెచ్​క్యూ-9బీ లాంగ్​ రేంజ్​, హెచ్​క్యూ-16 మీడియం-రేంజ్ వైమానిక రక్షణ వ్యవస్థలు కొనుక్కుంది. కానీ ఆపరేషన్ సింధులో భారత్ వాటిని చిత్తు చిత్తు చేసేసింది. భారత్​ బ్రహ్మోస్​, SCALP క్షిపణులను అడ్డుకోవడంలో ఎందకూ పనికి రాకుండా పోయాయి. పాకిస్తాన్, వెనెజువెలా పరిస్థితి చూశాక చైనా ఆయుధాలను దీపావళి సామాన్లతో పోలుస్తున్నారు. వాటిలాగే సౌండ్ తప్ప మరేమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు