Pakistan: సల్మాన్‌ఖాన్‌పై పాకిస్తాన్ ఆగ్రహం..ఉగ్రవాదిగా ప్రకటన

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై పాకిస్తాన్ పీకల దాకా కోపంగా ఉంది. అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది. సల్మాన్ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం.

New Update
Salman Khan,

కండల వీరుడు సల్మాన్ ఖాన్ రీసెంట్‌గా సౌదీ అరేబియాలో జాయ్ ఫోరం 2025 అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇందులో బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా చెబుతూ మాట్లాడాడు. ఇప్పుడు ఇదే పాకిస్తాన్ వాళ్ళకు కోపం తెప్పిస్తోంది. సల్మాన్ ఖాన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయ్యాయి. ఇందులో సల్మాన్ బలూచిస్తాన్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ ప్రజలు అందరూ సౌదీ అరేబియాలో కష్టపడి పని చేస్తున్నారని అని చెప్పారు. ఇందులో బలూచిస్తాన్‌ వేరే దేశం అనే అర్ధం వచ్చే విధంగా ప్రత్యేకంగా విడదీసి మరీ మాట్లాడారు సల్మాన్.

ఉగ్రవాదిగా అధికార ప్రకటన..

సల్మాన్ వ్యాఖ్యలకు బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు ఆనందంతో ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. కానీ పాకిస్తాన్ మాత్రం కోపంతో రగిలిపోతోంది. ఇ్పటికే పాక్, బలూచిస్తాన్‌ల మధ్య చాలా రోజులుగా యుద్ధం జరుగుతోంది. తమను తాము వేరే దేశంగా ప్రకటించుకుంది బలూచ్. కానీ పాకిస్తాన్ దానిని ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సల్మాన్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో అతనిని ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సల్మాన్ ఖాన్‌ను నాల్గవ షెడ్యూల్‌లో ఉంచింది. ఈ జాబితా ఉగ్రవాద నిరోధక చట్టం కిందకు వస్తుంది. ఇందులో వ్యక్తులు పాకిస్తాన్‌లో చట్టపరమైన చర్యలకు లోబడి ఉంటారు. దీనిపై పాకిస్తాన్ అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే సల్మాన్ ఖాన్ గానీ, ఆన ప్రతినిధుల నుంచి కానీ ఎటువంటి స్పందనా రాలేదు. 

మరోవైపు బలూచిస్తాన్ స్వాంత్ర పోరాట నాయకుడు మీర్ యార్ బలూచ్ మాత్రం సల్మాన్ సౌదీ అరేబియాలో బలూచిస్తాన్ గురించి ప్రస్తావించడం 60 మిలియన్ల బలూచ్ పౌరులకు ఆనందాన్ని కలిగించిందని ప్రకటించారు. ప్రధాన దేశాలు కూడా చేయడానికి వెనుకాడే పనిని బాలీవుడ్ హీరో చేశాడని అన్నారు. ఇలా ప్రజలను అనుసంధానించడం, బలూచ్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించేలా ప్రపంచాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం అని..ఈ పని చేసిన సల్మాన్‌కు కృతజ్ఞతలు అని మీర్ చెప్పారు.  

Also Read: Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం ఎఫ్‌ఐఆర్‌ కాపీ..ఇద్దరిపై కేసు నమోదు

Advertisment
తాజా కథనాలు