National Guards: షికాగో చాలా ప్రమాదకరంగా ఉంది..రక్షణ అవసరం..ట్రంప్

అమెరికాలోని షికాగో నగరం అత్యంత ప్రమాదకరంగా ఉందని అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసపెట్టి అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని...నగరంలో నేరాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర బలగాలను దించాల్సిందేనని చెప్పారు. 

New Update
Donald Trump

Donald Trump

అమెరికాలో నేరాలను తగ్గించాలనే లక్ష్యంతో ఉన్నారు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్. దాని కోసం నేరాలు తీవ్రంగా ఉన్న నగరాల్లో కేంద్ర బలగాలను దించుతానని చెబుతున్నారు. ఈ క్రమంలో షికాగో గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర నగరంగా షికాగో ఉందని అన్నారు. ఈ వీకెండ్ లో 54 మందిపై కాల్పులు జరపగా..ఎనిమిది మంది మృతి చెందారని ఉదాహరణ చెప్పారు. లాస్ట్ రెండు వారాల్లోనే ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. అంతకు ముందువి కూడా లెక్క వేసుకుంటే...ఇంకెంత ఉంటుందోనని ట్రంప్ ఆరోపించారు. షికాగో గవర్నర్ ఈ విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నారని...ఆయనకు తమ సహాయం అవసరమని చెప్పారు. తొందరలోనే అక్కడ పరిస్థితి చక్కబరుస్తానని అన్నారు. వాషింగ్టన్ డీసీలో కేంద్ర బలగాలను దించి ఎలా వేగంగా సమస్యను పరిష్కరించామో...షికాగోలో కూడా అదే చేస్తామని అన్నారు. త్వరలోనే షికాగో సురక్షిత నగరంగా మారుతుందని అన్నారు. తన ట్రూత్ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పెద్ద పోస్ట్ ను పెట్టారు. 

షికాగో కన్నా ముందు డీసీ, లాస్ ఏంజెలెస్..

ఇప్పటి వరకు లాస్ ఏంజెలెస్, వాషింగ్టన్ డీసీల్లో కేంద్ర బలగాలను మోహరించారు ట్రంప్. డీసీలో అత్యవసర పరిస్థితి నెలకుందన్న అధ్యక్షుడు.. అక్కడ నేరాలు చాలా ఎక్కువ అయిపోయాయని..అందుకే నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపానని చెప్పారు.  దాంతో పాటూ పబ్లిక్ సేఫ్టీ ఎమెర్జెన్సీని ప్రకటించారు. నేరాలను అరికట్టేందుకు మెట్రోపాలిటన్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను ఫెడరల్‌ అధీనంలోకి తీసుకున్నారు.  దాంతో పాటూ 800 మంది నేషనల్ గార్డ్స్ ను దింపారు. దీంతో డీసీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేశారు. అలాగే నేరాలను అరికట్టేందుకు అని చెబుతూనే వాషింగ్టన్ లో ఉన్న నిరాశ్రయులను కూడా బయటకు పంపించేస్తానని అన్నారు ట్రంప్. మొత్తం 5, 138 మంది పెద్దలు, పిల్లలు డీసీని వదిలి వెళ్ళిపోవాలని చెప్పారు. దీనికన్నా ముందు లాస్ ఏంజెలెస్ లో నేషనల్ గార్డ్స్, మెరైన్ బలగాలను డిప్లాయ్ చేశారు. వలసదారులపై ఆకస్మిక తనిఖీలు, దాడులు చేయడంతో అక్కడి పరిస్థితి దారుణంగా మారింది. చాలా రోజుల పాటూ ప్రజలు ప్రొటెస్ట్ చేశారు. వారిని అణచడానికి, అక్రమ వలసదారులను బయటకు పంపించడానికి ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపారు. 

Also Read: Pakistan: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి...11 మంది మృతి

Advertisment
తాజా కథనాలు