Israel:హెజ్బొల్లా టాప్ కమాండర్‌‌ను హతమార్చిన ఇజ్రాయెల్

హెజ్బుల్లా టాప్ కమాండర్‌‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నాసర్‌ బ్రిగేడ్‌ రాకెట్‌, మిస్సైల్స్‌ యూనిట్‌కు చెందిన జాఫర్‌ ఖాదర్‌ ఫార్‌ను దక్షిణ లెబనాన్‌లో హతమార్చినట్లు తెలిపింది. అయితే ఈ విషయాన్ని ఇంకా హెజ్బొల్లా ఇంకా ధృవీకరించలేదు.

New Update
11

 Hezbollah Top Commander Died: 

ఇజ్రాయెల్ మరో మెజ్బుల్లా టాప్ కమాండ్‌ను మట్టుబెట్టింది. ఈ విషయంపై ఐడీఎఫ్ తాజాగా ఈరోజు ప్రకటించింది. నాసర్‌ బ్రిగేడ్‌ రాకెట్‌, మిస్సైల్స్‌ యూనిట్‌కు చెందిన జాఫర్‌ ఖాదర్‌ ఫార్‌ను దక్షిణ లెబనాన్‌లో హతమార్చినట్లు అనౌన్స్ చేసింది. ఇజ్రాయెల్‌పై చోటుచేసుకున్న పలు రాకెట్‌ దాడుల వెనక జాఫర్ హస్తం ఉన్నట్లు ఐడీఎఫ్‌ తెలిపింది. అయితే దీనిపై హెజ్లులా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. గతవారం మెటులా ఘటనలో ఐదుగురు ఇజ్రాయెలీలు చనిపోయిన ఘటన వెనకుంది జాఫరే అని ఐడీఎఫ్‌ చెపింది. అంతేకాకుండా గతేడాది అక్టోబర్ 8న తూర్పు లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులను హెజ్‌బొల్లా చేపట్టింది. ఇతని ఆధ్వర్యంలోనే ఆ దాడులు జరిగాయని అంటోంది. 

మరోవైపు ఉత్తర లెబనాన్‌లో సీనియర్ హెజ్బొల్లా ఆపరేటివ్‌ను బంధించామని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే పట్టుకున్నది ఎవరన్నది మాత్రం వివరాలు ఇంకా బయటకు చెప్పలేదు. బందీ చేసిన వ్యక్తి విచారిస్తున్నామని మాత్రం ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ నేవీ దీనిని చేసింది. ఇక లెబనాన్ కు చెందిన నేవీ కెప్టెన్‌ను అపహరించినట్లు..లనీస్ అధికారులు కూడా ధృవీకరించారు దీని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని వారు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ నేవీ కెప్టెన్‌కు, హెజ్బోఒల్లాకు సంబంధాలుండవచ్చని కూడా లెబనాన్ మిలటరీ అధికారులు అంటున్నారు. 

Also Read: India: విశ్వమిత్రగా భారత్...విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు