/rtv/media/media_files/2025/01/22/2XlFiNptesgl4xZuND0K.jpg)
Donald Trump
Donald Trump: అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ తొలిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు,తన కుటుంబ సభ్యులు, పలువురు అధికారులకు క్షమాభిక్ష ప్రసాదించుకున్నారని విమర్శించారు.
Also Read: Maharashtra Train Accident: 12 మంది ప్రాణాలు తీసిన పుకారు.. రైలు ప్రమాదానికి ఇదే కారణం
తొలిసారి అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో తనకు తాను క్షమాభిక్ష ప్రసాదించుకునే అధికారం ఉన్నా దాన్ని వినియోగించుకోలేదని వెల్లడించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న దేశ భక్తులను కాపాడేందుకే తాజాగా ఈ అధికారాన్ని వాడుకొన్నట్లు స్పష్టం చేశారు. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ కంపెనీ టిక్ టాక్ సేవలకు సంబంధించి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ఉమ్మడి సంస్థలో 50 శాతం వాటా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానికి వారు అంగీకరిస్తే మేమే టిక్ టాక్ ను రక్షిస్తాం ఉత్తమంగా నడిపించే వారి చేతుల్లోకి అది వెళ్తుంది .
నిఘా పెట్టడం వల్ల..
అప్పుడే దాని సేవలను అనుమతిస్తాం అని ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే అంశం పై ఇంటర్వ్యూలో మాట్లాడారు. భద్రతాపరమైన ఆందోళనలను తోసిపుచ్చారు. మనకు చైనా వస్తువులు చాలా ఉన్నాయి. వాటి ఎందుకు ప్రస్తావించరు. టిక్‌టాక్ విషయానికొస్తే..దానికి ఎక్కువగా వాడేది యువతే. చైనా వారి మీద నిఘా పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది..? యువత చూసేది క్రేజీ వీడియోలే కదా..! అని ట్రంప్ అన్నారు.
Also Read: Horoscope Today: నేడు ఈ 2 రాశులవారికి మనోబలం ఎక్కువగా ఉంటుంది...ఈ రాశుల వారికి అయితే..!