USA Ban two on oil companies: రష్యన్ చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు..యుద్ధాన్ని ముగించాలని పిలుపు

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా సీరియస్‌గా ఉన్నారు. బుడాపెస్ట్‌లో పుతిన్‌తో సమావేశాన్ని క్యాన్సిల్ చేశాక..రెండు రష్యన్ చమురు కంపెనీలపైన నిషేధాన్ని విధించారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపాలని మాస్కోకు ట్రంప్ పిలుపునిచ్చారు. 

New Update
Trump

Trump

రష్యాపై డైరెక్ట్ అటాక్ మొదలెట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. చర్చలతో టైమ్ వేస్ట్ అన్న ఆయన రష్యా చమురు కంపెనీలపై ఆంక్సలను విధించారు. మాస్కో యుద్ధ నిధులను అరికట్టడానికి, ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడానికి ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి తీసుకుని రావడం ఒక్కటే మార్గమని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా రష్యాలోని అతి పెద్ద చమురు సంస్థలైన రోస్‌నెస్ట్, లుకోయిల్‌పై ఆంక్షలు ప్రకటించారు. దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ ప్రకటన జారీ చేసింది. రెండు పెద్ద చమురు సంస్థలు...వాటి అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారీ ఆంక్షలను అమలు చేయనున్నామని తెలిపింది. 

ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయడమే లక్ష్యంగా..

రష్యాలోని అతి పెద్ద చమురు కంపెనీలపై విధించిన ఆంక్షలతో మాస్కో దిగి వస్తుందని తాను భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. దీని వలన ఆదేశానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని..దాని నుంచి తప్పించుకోవడానికి అయినా ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపేస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. యుద్ధాన్ని ముగించడానికి ఇదే కరెక్ట్ సమయమన్నారు. వార్‌ను ముగించడంలో రష్యాకు నిబద్ధత లేనందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని OFAC తెలిపింది. చమురు కంపెనీలపై ఆంక్షల ద్వారా యుద్ధానికి సేకరించే ఆదాయానికి గండిపడుతుంది. దీని వలన క్రెమ్లిన్ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం తగ్గుతుంది అని చెప్పింది. ఈ ఆంక్సలను తొలగించాలంటే శాశ్వత శాంతి కోసం రష్యా చర్చలు రపడానికి రావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. యుద్ధాన్ని ముగించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్తృత దౌత్య ప్రయత్నంలో ఈ ఆంక్షలు భాగమని యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ చెప్పారు. రష్యా తన సైనిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకునే సామర్థ్యాన్ని దిగజార్చడంతో పాటూ దాని ఇంధన ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడానికే చమురు కంపెనీలపై ఆంక్షలు రూపొందించబడ్డాయని బెసెంట్ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు