BIG BREAKING: ఆ దేశంపై అమెరికా బాంబుల వర్షం!

వెనిజులాపై అమెరికా తన దండయాత్రలను కంటిన్యూ చేస్తోంది. ఆ దేశానికి చెందిన మరో బోట్ పై అమెరికన్ సేనలు దాడి చేశాయి. ఈ దాడిలో ముగ్గురు వెనెజులాకు చెందిన టెర్రరిస్టులు మృతి చెందగా..సైన్యం ప్రాణాలతో బయటపడిందని చెబుతున్నారు.

New Update
venezula war

USA-Venezuela War

అమెరికా, వెజులా ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ దేశంలో డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు అమెరికా తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా డ్రగ్స్ సరఫరా సమాచారంతో ఈరోజు మరో వెనెజులా బోట్ మీద దాడి చేసింది యూఎస్ సైన్యం. ఇందులో ముగ్గురు టెర్రరిస్టులు మృతి చెందారని తెలుస్తోంది. మరోవైపువెనెజులాపై అమెరికా ఏ క్షణమైనా యుద్ధానికి దిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇప్పటికే అగ్రరాజ్యం దక్షిణ కరేబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలను మోహించింది. దాంతో పాటూ అమెరికన్లను చంపేందుకు డ్రగ్స్ సరఫరా చేస్తే...వేటాడి వెంటాడి చంపుతామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో బోట్ పై దాడి చేయడంతో రెండు దేశాల మధ్యా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు చెబుతున్నారు.

మాదక ద్రవ్యాల సరఫరాపై యుద్ధం..

వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో కత్తి కట్టారు. అక్కడి నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అక్కడి కొన్ని ముఠాలు దీని వెనుక ఉన్నాయని...దానికి వెనిజులా నికోలస్‌ మదురోకు కూడా సపోర్ట్ చేస్తున్నారని చెబుతోంది. వెనిజులా అధ్యక్షుడిని పట్టనివ్వాలని కూడా అమెరికా ఎప్నటినుంచో కోరుతోంది. ముదురో సమాచారం ఇస్తే ఏకంగా 50 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.430 కోట్లు) బహుమతి కూడా ప్రకటించింది. ముదురూ ఎన్నికలను వైట్ హౌస్ గుర్తించడం లేదని వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్లెవెట్టి తెలిపారు. అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ట్రంప్ కార్యవర్గం సన్నద్ధం అయింది.

దీనికి సంబంధించి కరేబియన్ సముద్రంలో భారీగా సైన్యాన్ని మోహరించింది అమెరికా. భారీ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్‌జెట్‌లను రంగంలోకి దింపింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశం చుట్టూ ఇవి టైమ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనిజులాను ఆక్రమించుకోవచ్చని చెబుతున్నాయి. మేదక ద్రవ్యాల ముఠాల కోసమే ఇదంతా అని అమెరికా చెబుతోంది. దీనికోసం మొత్తం ఎనిమిది వార్ షిప్ లను పంపించింది. ది ఇవో జిమా యాంఫిబియస్రెడీగ్రూప్‌లోనియూఎస్‌ఎస్‌ శాన్‌ ఆంటోనియో, యూఎస్‌ఎస్ఇవో జిమా, యూఎస్‌ఎస్‌ ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ నౌకలు 4,500 మంది సైనికులతో కరేబియన్‌ సముద్రంలోకి వెళ్లాయి. వీటిల్లో 22వ మెరైన్‌ యూనిట్‌ కమాండోలు 2,200 మంది ఉన్నారు. ఇవి కాకుండా ఏవీ-8బీ హారియర్‌ అటాక్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌, గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్లైనయూఎస్‌ఎస్‌ జాన్సన్‌ డున్హమ్‌, యూఎస్‌ఎస్గ్రేవ్లీలను కూడా సముద్రంలో ఉంచారు. యూఎస్ఎస్శాంప్సన్ కూడా తూర్పు పసిఫిక్ లోకి వ్చి చేరుతుందని అమెరికా చెబుతోంది. మరోవైపు శుక్రవారం రాత్రి 10 ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లను ప్యూర్టోరికోలో మోహరించింది. పెద్ద సంఖ్యలో పీ-8 నిఘా విమానాలను రంగంలోకి దించింది.

Also Read: World Championship: వరల్డ్ ఛాంపియన్ షిప్ స్పీడ్ స్కేటింగ్ లో రెండు బంగారు పతకాలు..

Advertisment
తాజా కథనాలు