IND-PAK WAR : పాకిస్తాన్‌కు వంతపాడుతున్న టర్కీ, అజర్‌బైజాన్.. షాకిచ్చిన ట్రావెల్‌ ఏజెన్సీలు

పహల్గాం ఉగ్రదాడితో భారత్‌, పాకిస్థాన్‌ ల మధ్క ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీశాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు భారతదేశానికి మద్ధతుగా నిలిచాయి. కానీ, పాక్‌కు టర్కీ, అజర్‌బైజాన్ మద్దతుగా నిలిచాయి. దీంతో అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీలు ఆ దేశాలకు షాకిచ్చాయి.

New Update

IND-PAK WAR : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ ల మధ్క నెలకొన్న ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీశాయి. గడచిన రెండు రోజులుగా రెండు దేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో  ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు భారతదేశానికి మద్ధతుగా నిలిచాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం పాకిస్థాన్‌ వైపు నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌కు టర్కీ, అజర్‌బైజాన్ మద్దతుగా నిలిచాయి. భారత్‌ చేపట్టిన దాడులను ఖండించాయి.  అంతేకాదు పాక్‌కు టర్కీ ఆయుధ సహాయం కూడా చేస్తోంది. ప్రతిరోజూ కనీసం 300--400 టర్కీష్‌ డ్రోన్లను పాక్‌  ప్రయోగిస్తున్నది. దీంతో  ఆ రెండు దేశాలకు ట్రావెల్‌ ఏజెన్సీలు గట్టి షాకిచ్చాయి.

ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
 
భారత్‌, పాకిస్తాన్‌ యద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతున్న టర్కీ, అజర్‌బైజాన్‌లకు.. ఇప్పటి నుంచి కొత్త బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు కీలక ప్రకటన చేశాయి. ఆ రెండు దేశాలకు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కూడా సూచించాయి. ఒకవేళ భారతీయులు ఎవరైనా ఆ రెండు దేశాలకు వెళ్లాల్సి వస్తే అక్కడి సున్నితమైన ప్రాంతాల పర్యటనల్లో చాలా అలర్ట్‌గా ఉండాలని సూచించాయి.

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

టర్కీ, అజర్‌బైజాన్, ఉజ్బెకిస్తాన్‌లకు కొత్త బుకింగ్‌లను కొంతకాలం పాటు నిలిపివేస్తున్నట్లు ప్రముఖ టూరిస్ట్ సర్వీసెస్ సంస్థ అయిన ‘కాక్స్ అండ్ కింగ్స్’ ప్రకటించింది. ఈ విషయమై  కాక్స్ అండ్ కింగ్స్ డైరెక్టర్ కరణ్ అగర్వాల్ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశారు. అజర్‌బైజాన్, టర్కీ, ఉజ్బెకిస్తాన్ దేశాలకు అనవసరమైన ప్రయాణాలను ప్రస్తుతం విరమించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాదు మరో ఆన్‌ లైన్‌ ట్రావెల్‌ ఏజెన్సీ అయిన ఈజ్‌ మై ట్రిప్ కూడా అదే సూచన చేసింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ఠ్యా ప్రయాణికులు మరింత అలర్ట్‌గా ఉండాలని కోరింది. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప టర్కీ, అజర్‌బైజాన్‌లను సందర్శించడం అంత మంచిది కాదని సూచించింది.ఈ రెండు దేశాలకు వెళ్లాలనుకునేవారు  ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఈజ్‌ మై ట్రిప్ ఫౌండర్ నిషాంత్ ట్వీట్‌ చేశారు. ఇదే కోవలో  ట్రావోమింట్ అనే మరో ట్రావెల్ ప్లాట్‌ఫామ్ కూడా కీలక ప్రకటన చేసింది.టర్కీ, అజర్‌బైజాన్‌లకు సంబంధించిన అన్ని రకాల ప్రయాణ ప్యాకేజీలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే బుక్‌ చేసుకున్న వారు తమ బుకింగ్‌లు రద్ధు చేసుకుంటే ఎలాంటి క్యాన్సలేషన్ ఫీజులు వసూలు చేయబోమని ట్రావోమింట్ తేల్చి చెప్పింది. 

Also Read: 'నాన్న అమ్మకు చెప్పకు.. నన్ను వెళ్ళనివ్వదు'.. వ్యోమికా సింగ్ సక్సెస్ స్టోరీ ఇదే!

దీన్ని బట్టి భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ప్రభావం చూపుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతున్న దేశాలకు ట్రావెల్ సంస్థలు బుకింగ్‌లు నిలిపివేయడంతో ఆయా దేశాలకు షాకిచ్చినట్లయింది.

ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు