/rtv/media/media_files/2025/02/16/G7PTevFqTse0jGrFqJNg.jpg)
Mali, Gold Mine
పశ్చిమాఫ్రికాలోని మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలో ఓ బంగారు గని కుప్పకూలింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో 42 మంది కార్మికులు మృతి చెందారు. అనేకమంది గాయాలపాలయ్యారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడం కలకలం రేపుతోంది. చైనా దేశస్థుల నిర్వహణలో ఉన్న గనిలో కొండచరియలు విరిగిపడి 42 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే బంగారు గని తవ్వకం చట్టబద్ధంగా నిర్వహిస్తున్నారా ? లేదా అక్రమంగా చేస్తున్నారా ? అనేదానిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: రేయ్ ఎవర్రా మీరంతా..! బర్డ్‌ఫ్లూ భయమే లేదు: ఊరంతా చికెన్ పండగే!
జనవరి 29న కౌలికోరో అనే ప్రాంతంలో కూడా బంగారు గని కూలింది. ఈ ఘటనలో కూడా 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి ఆచూకీ కనిపించకుండా పోయింది. వీళ్లలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. గనిలోకి బురదనీరు ప్రవేశించింది వాళ్లను చుట్టుముట్టింది. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. అంతేకాదు గతేడాది జనవరిలో కూడా మాలి రాజధాని బమాకో సమీపంలో ఇలాంటి దుర్ఘటనే జరిగింది. ఆ ప్రమాదంలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Also Read: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు
అయితే మాలి జనాభాలో 20 లక్షల మందికన్నా ఎక్కువగా ఈ మైనింగ్ రంగం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లో మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా మాలికి పేరుంది. ఇక్కడ బంగారు గనిలో తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలామంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మరీ బతుకుదెరువు కోసం గనుల తవ్వకాల కోసం వెళ్తుంటారు.
Also Read: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు
Also Read: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!