/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T143511.935.jpg)
Donald Trump: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఇంకా అధికార పగ్గాలు చేపట్టకముందే అగ్రరాజ్యాన్ని అల్లాడిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందుగానే టిక్ టాక్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
టిక్‌టాక్ కంపెనీలో సుమారు 50 శాతం వాటా యూఎస్ పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా కండిషన్ తో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆ సేవలను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించి వార్తల్లో నిలిచారు.
మరింత అద్భుతంగా...
తద్వారా అమెరికా భద్రతకు సంబంధించి మరో ఒప్పందం కూడా చేసుకోనున్నారు.. ఉమ్మడి వెంచర్‌లో 50 శాతం వాటా ఉండాలి.. దీనికి వారు ఒకే అంటే మేమే టిక్‌టాక్‌ను రక్షిస్తామని ఆయన వెల్లడించారు. అప్పుడు టిక్ టాక్ మరింత అద్భుతంగా నడిపించే వారి చేతుల్లోకి వెళుతుందని ట్రంప్ వివరించారు. దాంతో మేము టిక్ టాక్ సేవలకు అనుమతిస్తామని తన సోషల్ మీడియా ట్రూత్‌లో డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు.ఇక, ఈనెల 19వ తేదీ నాటికి టిక్‌టాక్‌ను విక్రయించాలని అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. గడువులోపు విక్రయంచకపోతే.. యాప్‌ను బ్యాన్ చేస్తామని అందులో పేర్కొంది.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారు సంఘంలో కీర్తి ప్రతిష్ఠ పొందుతారు..అంతే కాకుండా..
యూఎస్ సుప్రీంకోర్టు సైతం టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌కు గడువు ఇచ్చింది. కానీ, ఎలాంటి అమ్మకాలు జరగకపోవడంతో నిన్న టిక్‌టాక్ సేవల్ని ఆపివేస్తున్నట్లు సంస్థ యూజర్లకు తెలియజేసింది. దీంతో గూగుల్, యాప్ సంస్థలు తమ ప్లేస్టోర్ నుంచి టిక్‌టాక్‌ను తొలగించాయి. దీనిపై తాజాగా ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
ఇక, డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై టిక్‌టాక్ రియాక్ట్ అయింది. పునరుద్ధరణ సేవల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అమెరికాలో దీర్ఘకాలం కొనసాగేందుకు పరిష్కారం చూపేలా ట్రంప్‌తో కలిసి పని చేయబోతున్నట్లు సదరు టిక్ టాక్ వెల్లడించింది. మా సర్వీస్ ప్రొవైడర్లతో ఒప్పందం ప్రకారం.. ఈ సేవలను తిరిగి ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
17 కోట్ల మంది అమెరికన్లు దీన్ని వినియోగిస్తున్నారు. అలాగే, చిరు వ్యాపారాలు వృద్ధి చెందేందుకు వీలు కల్పిస్తున్నందుకు సర్వీస్ ప్రొవైడర్లపై ఎలాంటి ఫైన్స్ విధించకుండా ఉండేందుకు ట్రంప్ అవసరమైన హామీ ఇచ్చారని టిక్ టాక్ సంస్థ తెలిపింది.
Also Read: బిగ్ బాస్ 18 విన్నర్ కరణ్ వీర్ మెహ్రా.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Also Read: కేసీఆర్, హరీశ్ లకు బిగ్ షాక్.. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ కీలక నిర్ణయం!