Dalai Lama: చైనాకు బిగ్ షాకిచ్చిన బౌద్ధ గురువు దలైలామా.. వారసుడు అతనే!

బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు త్వరలో 90 ఏళ్లు నిండటంతో కొత్త వారసుడి గురించి జోరుగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 14వ దలైలామా 15వ దలైలామాను ఎన్నుకుంటారు. ఈ క్రమంలో దలైలామా చైనాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

New Update
Dalai Lama

బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు త్వరలో 90 ఏళ్లు నిండటంతో కొత్త వారసుడి గురించి జోరుగా చర్చ జరుగుతుంది. కొత్త వారసుడిని ఎన్నుకునే సంప్రదాయం దాదాపుగా 600 ఏళ్ల నుంచి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న 14వ దలైలామా 15వ దలైలామాను ఎన్నుకుంటారు. ఈ క్రమంలో దలైలామా ఓ ప్రకటన విడుదల చేశారు. టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం వారసుడిని ఎంపిక తామే చేస్తామని, చైనాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

ఇది కూడా చూడండి:Missing girl : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్‌ వైపు వెళ్లి.....

ఇది కూడా చూడండి:మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!

తమకు అనుకూలమైన వ్యక్తిని..

తమకు అనుకూలమైన వ్యక్తిని దలైలామాగా నియమించాలని చైనా భావిస్తోంది. దీని వెనుక ఎన్నో కుట్రలు చేయాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉన్న దలైలామా మరణం తర్వాత కొత్త వారసుడిని ఎన్నుకునే అధికారం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కు అప్పగించారు. ఈ దలైలామా ఇన్స్టిట్యూట్ భవిష్యత్తులో కూడా ఉంటుంది. టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం దలైలామాను ఎంచుకుంటామని తెలిపారు. 

ఇది కూడా చూడండి:Kannappa Box Office Collections: మంచు విష్ణుకు బిగ్ షాక్.. 'కన్నప్ప' కలెక్షన్ల డౌన్..ప్రభాస్ కూడా ఆదుకోలేడా!

దలైలామా పుట్టిన రోజు జులై 6వ తేదీ. దీని కంటే ముందే ఇలా ప్రకటన చేయడంతో చైనాకు పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న దలైలామా అసలు పేరు టెన్జిన్ గ్యాట్సో. ఈయన 14వ దలైలామాగా ఉన్నారు. ఇతను 1935లో టిబెట్‌లోని టాక్సేర్ గ్రామంలో జన్మించి.. 1940లో 14వ దలైలామాగా గుర్తింపు పొందారు. ఇప్పుడు 15వ దలైలామా ఎవరనే ప్రశ్న చాలా మందిలో ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు