Earthquake in Bangkok: బ్యాంకాక్‌లో భూకంపం ఎఫెక్ట్.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. దీంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి (Emergency)ని ప్రకటించింది.

New Update
Emergency in bangkok

Emergency in bangkok

Earthquake in Bangkok: బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. దీంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం(Thailand Government) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి (Emergency)ని ప్రకటించింది. ఈ భూకంపం ధాటికి పలు బిల్డింగ్స్ ఊగిపోయాయి. ఓ బహుళ అంతస్తుల భవనం నేలమట్టమైంది. చుట్టుపక్కల జనం భయంతో రోడ్లమీదికి పరుగులు తీశారు. జర్మనీకి చెందిన GFZ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ శుక్రవారం మధ్యాహ్నం భూకంపం సంభవించిదని ప్రకటన చేసింది.

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

రిక్టర్‌ స్కేల్‌పై 7.7గా

సెంట్రల్ మయన్మార్‌లోని మోనివా సిటీకి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 12 నిమిషాల వ్యవధిలోని మయన్మార్‌లో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.7గా నమోదైంది. దీని ప్రభావంతోనే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రెండుసార్లు తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం ధాటికి మయన్మార్‌లో ఇప్పటిదాకా 20మంది మృతిచెందినట్లు అక్కడి లోకల్ మీడియా తెలిపింది. అనేకమంది గాయాలపాలైనట్లు చెప్పింది. మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: అమెరికాతో ఆ బంధం ముగిసింది.. ఇక ప్రతి చర్య తప్పదు: కెనడా!

ఈ భూకంప ప్రభావం ఆగ్నేసియా దేశాలపై కూడా కనిపించింది. భారత్‌లోని ఢిల్లీ ఎన్సీర్, కోల్‌కతా, ఇంఫాల్, మేఘాలయాలో స్వల్పంగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.మేఘాలయ ఈస్ట్‌గారో హిల్స్‌ రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. బంగ్లాదేశ్‌లో 7.3 తీవ్రతతో భూమి కంపించినట్లు సమాచారం.  

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

Also Read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

telugu-news | rtv-news | earthquake

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు