BIG BREAKING: అమెరికాలో దారుణం..దుండగుడు కత్తితో దాడి..11 మందికి తీవ్ర గాయాలు

అమెరికాలో గన్ కల్చర్, దాడులు చాలా ఎక్కువే జరుగుతుంటాయి. తాజాగా మిషిగన్ లోని ట్రావెర్స్ సిటీలోని వాల్ మార్ట్ సూపర్ సెంటర్ ఓ అగంతకుడు కత్తితో జనాలపై దాడి చేశాడు.  ఇందులో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

New Update
walmart

Walmart Super Center

కొద్దిసేపటి క్రితం అమెరికాలోని మిషిగన్ స్టేట్ లో  ట్రావెర్స్ సిటీ దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అక్కడి వాల్ మార్ట్ సూపర్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. వస్తువులను తీసుకున్న తర్వాత డబ్బులు పే చేసే క్యూ లైన్ లో దుండుగుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. ఇందులో 11మందికి తీవ్ర గాయాలయ్యాయి.  సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసుల అదుపులో సంఘటనా స్థలం..

ఈ సంఘటనతో వాల్ మార్ట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎటువంటి కాల్పులు జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు అక్కడ అంతా శాంతపర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గాయపడిన వారిని అత్యవసర బృందాలు సంఘటనా స్థలంలోనే చూస్తున్నారు. కొంతమందిని ఆంబులెన్స్ లో వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఎందుకు దాడి చేశాడు అన్న వివరాలు ఇంకా తెలియలేదు. అతను ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది. 

Advertisment
తాజా కథనాలు