/rtv/media/media_files/2025/07/28/thailand-and-cambodia-agreed-to-ceasefire-2025-07-28-19-25-55.jpg)
Thailand and Cambodia agreed to 'immediate ceasefire'
గత కొన్నిరోజులాగా థాయ్‌లాండ్-కంబోడియా మధ్య కాల్పులు జరగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. సోమవారం మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కొన్నిరోజులుగా సరిహద్దుల్లో థాయ్‌లాండ్-కంబోడియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నాయి. ఇరుదేశాలు క్షిపణులతో ఒకదానిపై మరొకటి విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాలు కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించాయని ఆదివారం ప్రకటించారు.
Also Read: వీడసలు డాక్టరేనా? నిద్రపోయిన డాక్టర్..గాలిలో కలిసిన పేషేంట్ ప్రాణం
దీంతో కాల్పుల విరమణమపై చర్చలు జరిపేందుకు మలేసియాలో భేటీ కావాలని ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయి. చివరికి ఒప్పందానికి అంగీకరించాయి. ముందుగా సరిహద్దు వెంట మందుపాత పేలి అయిదుగురు థాయ్‌లాండ్ సైనికులు గాయపడిన సంగతి తెలిసిందే. దీంతోనే ఇరుదేశాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత తేలికాటి ఆయుధాలు, మిసైల్స్‌తో దాడులు చేసుకున్నాయి.
Also Read: కువైట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ.. ఇండియాకు పంపించకుండా హింసిస్తున్న యజమాని
మరోవైపు కంబోడియాలో తమ రాయబారిని థాయ్‌లాండ్ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఆ దేశ రాయబారిని కూడా బహిష్కరించింది. గత కొన్నిరోజులుగా జరిగిన ఘర్షణలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే రెండు లక్షల మంది ఇళ్లు కోల్పోయారు. ఇదిలాఉండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్నాడు. తాజాగా ఈ రెండు దేశాలలకు కూడా మధ్యవర్తిత్వం వహించారు. ఇప్పటికే ఇజ్రాయెల్-ఇరాన్, భారత్-పాక్ యుద్ధాలు ఆపినట్లు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.