/rtv/media/media_files/2025/02/13/Rt47ytBA5Ug42nJo0DFm.jpg)
Dalai Lama
టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల చైనా, భారత్ సంబంధాలలో సమస్యగా మారిందని ఇండియాలో ఉన్న చైనా రాయబార కార్యాలయం తెలిపింది. అయితే ఐదేళ్ల తర్వాత భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ చైనాలో మొదటిసారి పర్యటించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఇది కూడా చూడండి: Smartphone Offers: ఇదేక్కడి మాస్ రా మావా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 5జీ ఫోన్ ఇంత చీపా.. ఓ లుక్కేయండి బాసూ!
ఇండియాలోనూ ఉండవచ్చు..
జైశంకర్‌తో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపుగా ఒక ఆరు దశాబ్దాల నుంచి టిబెట్ నియంత్రణపై చైనాతో టిబెట్ బౌద్ధగురువు దలైలామాకు వివాదం ఉంది. అ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దలైలామా ఇటీవల 15వ దలైలామా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వారసుడు చైనా బయటే జన్మిస్తాడని తెలిపారు.
ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు
అది వేరే దేశం లేదా భారత్‌లో కూడా కావచ్చని అన్నారు. అయితే తన వారసత్వంపై చైనాకు నిర్ణయం తీసుకునే హక్కు అసలు లేదని తెలిపారు. కానీ చైనా మాత్రం దలైలామా వారసుడి ఎంపికకు మాత్రం తప్పకుండా తమ ఆమోదముద్ర కావాలని తెలిపింది.
ఇది కూడా చూడండి:Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?
ఇదిలా ఉండగా.. ఇటీవల దలైలామా పుట్టిన రోజు వేడుకలకు హాజరైన భారత కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ..15వ దలైలామాను ఎన్నుకునే అధికారం పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని అన్నారు.