/rtv/media/media_files/2025/01/06/AuMPlV7vxPq7UhpXmNqC.jpg)
ktr acb Photograph: (ktr acb)
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన FIRను క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ-రేస్ అంశంలో ఏసీబీ తనపై వేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. అయితే దీన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ కేవియట్‌లు కూడా పిటిషన్లు దాఖలు చేశాయి.
ఇక అరవింద్, దానకిశోర్ స్టేట్మెంట్స్ ఆధారంగా.. ఈరోజు ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను
విచారించారు. ఫార్మలా ఈ రేసు విషయంలో బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. దాంతో పాటూ కార్ రేసు కోసం ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లించడంపై కూడా ఏసీబీ ఆయనను ప్రశ్నలు అడిగింది. అలాగే కోడ్ ఉల్లంఘనపై కూడా కేటీఆర్‌ను విచారించింది.
ఈ ఫార్ములా కేసు ఇదే..
2023లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఫార్ములా- ఈ కార్ రేసుకు ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు. దీంతో ఆనాడు మంత్రి గా ఉన్న కేటీఆర్ రిక్వెస్ట్ చేయడం వల్ల 2024 ఫిబ్రవరి నెలలో జరగాల్సిన 2వ దఫా రేస్ నిర్వహణకు HMDA రూ.55 కోట్లు FEOకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఎన్నికల వేళ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూ.755 కోట్లు ఇవ్వడంపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుబట్టింది.
Also Read: Crime: హరియాణా బీజేపీ అధ్యక్షుడు, గాయకుడిపై అత్యాచార కేసు
కాగా కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే చెల్లించినట్లు పురపాలక శాఖ కమిషనర్ విచారణలో తెలిపారు. కాగా దీనిపై గతంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి జరిగిన విషయాలను బయటపెట్టారు. దీనిపై విచారణను ఏసీబీకు అప్పగించింది రేవంత్ సర్కార్. ఈ కేసులో పూర్తి వివరాలను బయటకు రాబట్టేందుకు మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ చేసి విచారణ చేయాలని ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేటీఆర్ అరెస్ట్ అనుమతి కొరకు గవర్నర్ కు లేఖ రాశారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా? అనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.
Also Read: Kamala Jobs: స్టీవ్ జాబ్స్ కోరిక తీర్చిన భార్య..కుదుటపడిన ఆమె ఆరోగ్యం