/rtv/media/media_files/2025/06/23/iranian-crown-prince-reza-pahlavi-and-khamenei-2025-06-23-21-34-02.jpg)
Iranian Crown Prince reza Pahlavi and Khamenei
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికాకు లొంగిపోయేది లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఖమేనీకి బిగ్ షాక్ తగిలింది. ఇరాన్ విపక్ష నేత, చివరి షా అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కొడుకు రెజా పహ్లవి రంగంలోకి దిగారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసిన తర్వాత ఖమేనీ ఏం సాధించారంటూ నిలదీశారు. సోమవారం పారిస్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Also Read: ఎన్నికల కౌటింగ్ కేంద్రంలో బాంబు పేలుడు.. 10 ఏళ్ల చిన్నారి మృతి
ఇరాన్‌లో రక్తపాతంతో తడిసి ముద్దవడం తప్పా ఖమేనీ వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని గతంలో దేశ బహిష్కరణకు గురైన రెజా పహ్లవి ఆరోపించారు. ఖమేనీ దిగిపోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. నిజాయతీగా విచారణ ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇరాన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ పరిస్థితి ముగింపు దశకు వచ్చిందని.. ఖమేనీతో సహా మరికొందరు దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఎవరికీ లొంగిపోను అంటూ దేశంలో విధ్వంసానికి కారణమయ్యాడని విమర్శించారు. ఇలా ఒక్కరి చేతుల్లో బందీ అయిన దేశాలు సుఖపడినట్లు చరిత్రలో లేదని తెలిపారు.
Also Read: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. 350కి పైగా డ్రోన్లతో కాల్పులు
ఇదిలాఉండగా.. 1979 ఇరాన్ విప్లవం జరగడం వలల్ పహ్లవి వంశం పతనమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇరాన్ క్రౌన్ ప్రిన్స్‌గా రెజా పహ్లవినే ఉన్నారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరాన్‌లో సంచలనం రేపుతున్నాయి. దేశంలో అధికార మార్పుకు సమయం వచ్చిందనే సంకేతాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇలా జరుగుతుందా ? లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: ఉప ఎన్నికల్లో ఫలితాల్లో ఆప్ ప్రభంజనం.. షాక్‌లో బీజేపీ
 Follow Us