BIG BREAKING: పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టు సంచలన ప్రకటన

రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌లపై విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

New Update
Telangana high court key comments on local body elections resrvations

Telangana high court key comments on local body elections resrvations

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ముగిసింది. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయించారు. అయితే రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. రిజర్వేషన్ల వ్యవహారానికి సంబంధించి దాఖలైన ఆరు పిటిషన్‌లపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. చట్టప్రకారం ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. 

Also Read: ఆదిలాబాద్‌కు త్వరలో ఎయిర్‌పోర్టు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

SC, ST జనాభా లేని ప్రాంతాల్లో కూడా ఆయా కులాలకు సర్పంచ్, వార్డు మెంబర్లుగా రిజర్వేషన్లు కేటాయించారనే దానిపై పలువురు కోర్టులో పిటిషన్ వేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రిజర్వేషన్లు తప్పుగా కేటాయించారని పేర్కొన్నారు. అయితే రిజర్వేషన్లు కేటాయించిన చోట సంబంధిత కులానికి చెందిన వ్యక్తులు లేనట్లయితే అసలు ఎన్నికలే నిర్వహించబోమని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు వివరించింది. ఈ వాదనను రికార్డు చేసుకున్న న్యాయస్థానం విచారణను క్లోజ్ చేసింది. 

Also Read: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి బిగ్‌షాక్‌..కొడుకు కంపెనీపై కేసు

Advertisment
తాజా కథనాలు