కాలిఫోర్నియా ఇంకా అగ్ని గుండంలా మండుతూనే ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. ఇప్పటికే అక్కడ చాలా తగలబడిపోయింది. దాదాపు 10 వేల భవనాలు, ఇళ్ళు బుగ్గిపాలయ్యాయి. సుమారు 12.9 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. 3.6 లక్షల మంది తమ ఇళ్ళను ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు. హాలీవుడ్ స్టార్స్ ఇళ్ళు సైతం కాలి బూడిద అయ్యాయి. హాలీవుడ్ అంతా తగలబడిపోయింది. ఎక్కడివి అక్కడే అన్నీ ఆగిపోయాయి. View this post on Instagram A post shared by Ryan Wilcox (@lahikerdude) దయనీయమైన స్థితిలో నగరవాసులు.. మంటలను అదుపు చేయడానికి అగ్ని మాపక దళాలు విపరీతంగా శ్రమ పడుతున్నాయి. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అగ్ని మాపక సిబ్బంది వచ్చారు. లాస్ ఏంజెలెస్ స్టక్ అయిపోయింది. అందరూ ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని పరుగులు పెడుతున్నారు. అందినకాడికి సామాన్లు అందుకుని సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. కార్లు కూడా తీసుకుని వెళ్ళలేని పరిస్థితి. కాలి నడకనే వెళ్ళాల్సిన పరిస్థితి. రోడ్ల నిండా కార్లు ఎక్కడిక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఎటు చూసినా పూర్తిగా కాలిపోయి బూడిదగా కనిపిస్తున్న ఇళ్ళు. తమ కళ్ళముందే అంతా పోగొట్టుకుని ఏడుస్తున్న జనాలు కనిపిస్తున్నారు. మరోవైపు ధనవంతులు, హాలీవుడ్ స్టార్లు వదిలేసి వెళ్లిపోయిన ఇళ్లల్లో విలువైన వస్తువులను దొంగలు దోచుకుంటున్నారు. View this post on Instagram A post shared by Jonathan Grandini Surfboards (@jonathangrandini) చేతులెత్తేసిన బీమా రంగం.. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అమెరికా బీమా రంగం కుదేలయింది. జేపీ మోర్గాన్, మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం 20 బిలియన్ డాలర్ల వరకు బీమా సంస్థలకు నష్టం రావచ్చని అంచనా వేస్తోంది. చాలా మంది ఇళ్ళకు తాము బీమా ఇవ్వలేమని కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. ఇక కాలిఫోర్నియాలోని అతిపెద్ద బీమా సంస్థ స్టేట్ ఫామ్ అయితే కొన్ని నెలల కిందటే పాలిసాడ్స్‌లోని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు కార్చిచ్చు ముప్పు ఉందని గ్రహించి పాలసీలు ఇవ్వడం మానేసింది. మరోవైపు ప్రపంచంలోనే అతి పెద్దది అయిన బన్నీ మ్యూజియం పూర్తిగా కాలిపోయింది. ఇక్కడ దాదాపు 46,000 కుందేళ్ల రూపంలో ఉన్న వస్తువులు మంటల్లో కాలిపోయాయి. View this post on Instagram A post shared by Justin Harnish (@justinharnishproperties) లాస్ ఏంజెలెస్ కుదుట పడేవరకూ తాము ఎక్కడికీ కదలమని చెబుతున్నారు బైడెన్, కమలా హారిస్. తమ విదేశీ పర్యటనలు రద్దు చేసుకున్నారు. దాంతో పాటూ కాలిఫోర్నియాలో కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో ఆరు నెలల పాటు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. శిథిలాల తొలగింపు లాంటి చర్యల్లో సాయం చేస్తామన్నారు. View this post on Instagram A post shared by Tucker Doss (@tuckerdoss)