/rtv/media/media_files/2025/11/01/shut-down-2025-11-01-15-51-51.jpg)
Shutdown Effect in USA, over 7 billion dollars wiped out
అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత 31 రోజులుగా ఆర్థిక వ్యవస్థ మూతబడింది. ఈ క్రమంలోనే అమెరికా సంపదంలో 7 బిలియన్ డాలర్లు(రూ.62,149 కోట్లకు పైగా) నష్టం వాటిల్లింది. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ ఈ నష్టాన్ని అంచనా వేసింది. ఈ షట్‌డౌన్ ఇలాగే కొనసాగితే ఆరు వారాలకు 11 బిలియన్ డాలర్లు, 8 వారాలకు 14 బిలియన్ డాలర్ల వరకు ఆర్థిక నష్టం జరుగుతుందని పేర్కొంది.
మరోవైపు ఈ షట్‌డౌన్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని కేపీఎంజీ సంస్థ చీఫ్ ఆర్థికవేత్త డయాన్ స్వాంక్ పేర్కొన్నారు. మూడీస్ అనలిటిక్స్‌కు చెందిన మార్క్ జాండీ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని తెలిపారు. షట్‌డౌన్ వల్ల ఊహించిన దానికన్న పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Also Read: నిశ్చితార్థానికి ముందు ఊహించని ట్విస్ట్! వధువు తండ్రితో వరుడి తల్లి జంప్
ఇదిలాఉండగా అమెరికా ప్రభుత్వం 1981 నుంచి చూసుకుంటే 15 సార్లు మూతపడింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా 2018-19 మధ్య 35 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగింది. అంతేకాదు దేశ చరిత్రలో ఎక్కువ కాలం కొనసాగిన షట్‌డౌన్‌గా దీనికి పేరు వచ్చింది. మరోవైపు అమెరికాలో ప్రస్తుతం బలహీనంగా ఉన్న జాబ్ మార్కెట్‌పై ఇది ప్రభావం చూపిస్తోందని ఆర్థిక నిపుణులు తెలిపారు.
ఆర్థిక, విధానపరమైన అనిశ్చితి వల్ల వివిధ సంస్థలు కూడా పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్‌ను పరీక్షిస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగాలు కూడా పోతున్నాయని పలువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ షట్‌డౌన్ ఎఫెక్ట్ వల్ల ఆర్థిక ప్రభావం ఇప్పుడే కనిపించకపోయినా.. దీర్ఘకాలికంగా కొనసాగితే ఆర్థిక వృద్ధి మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దేశ ఆర్థిక వృద్ధిలో ప్రతివారం 0.1 నుంచి 0.2 పాయింట్ల వరకు తగ్గొచ్చని అంటున్నారు.
Also Read: ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టిన భార్య..శ్రీశైలం డ్యాంలో శవం
Follow Us