Davos : దావోస్‌ లో తెలంగాణతో పలు సంస్థల ఒప్పందం.. పెట్టుబడులకు ఆసక్తి..

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక (WEF) సదస్సులో పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంస్థలతో చర్చలు సాగిస్తోంది. అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాల్లో ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి, తమ కార్యాలయాలు ప్రారంభించడానికి ముందుకొచ్చాయి.

New Update
FotoJet - 2026-01-21T133009.700

CM Revanth Reddy davos tour

Davos : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ లో వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో తెలంగాణ పెట్టుబడుల కోసం పలు సంస్థలతో చర్చలు సాగిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆర్థిక మంత్రి హెచ్ఈ అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’(India’s Smartest Future City) అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి యూఏఈ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ భేటీలో సీఎం రేవంత్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపంలో నిర్మించనున్న ‘ఫోర్త్ సిటీ’ ప్రాజెక్టును వివరంగా వివరించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా రూపొందుతున్న ఈ నగరం భారత్ గర్వించదగ్గ ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విశేషాలను తెలుసుకున్న యూఏఈ ప్రతినిధులు, నగరాభివృద్ధిలో తమ దేశానికి ఉన్న అనుభవాన్న, సాంకేతికతను తెలంగాణతో పంచుకోవడానికి ఆసక్తి చూపారు.  

Blaize

Also Read :  అయ్యో..పిజ్జా హట్ చేతిలో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..అసలేం జరిగిందంటే..

బ్లైజ్ (Blaize) సంస్థతో అవగాహన ఒప్పందం

తెలంగాణ ప్రభుత్వం దావోస్​లో కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ (Blaize) సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సంస్థ డేటా సెంటర్ అర్టిఫిషియల్ కంప్యూటింగ్కు తక్కువ శక్తి వినియోగించే AI హార్డ్‌వేర్‌, ఫుల్-స్టాక్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం(world-economic-forum) సదస్సులో బ్లైజ్ కో ఫౌండర్ సీఈఓ దినాకర్ మునగాలా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు వేగవంతమవుతాయి.ఇప్పటికే బ్లైజ్ సంస్థ హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్, ఇంజినీరింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. తమ ఆర్ అండ్ డీ సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు, ప్రణాళికలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. హెల్త్‌కేర్ డయాగ్నోస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ఎనర్జీ ఎఫిషియెన్సీ వంటి రంగాల్లో ఏఐ ద్వారా పరిష్కారాలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. - cm-revanth-davos-tour

FotoJet - 2026-01-21T133021.681

ఇజ్రాయిలీ స్టార్టప్‌లతో తెలంగాణలో పైలట్‌ ప్రోగ్రామ్స్‌

దావోస్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఇజ్రాయెల్‌ ఇన్నొవేషన్‌ అథారిటీ ఛైర్మన్‌ అలోన్‌ స్టోపెల్‌తో భేటీ అయ్యారు. ఏఐ, హెల్త్‌టెక్‌, అగ్రి-టెక్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఏరోస్పేస్‌ రంగాల్లో తెలంగాణకు ఇజ్రాయెల్‌ మద్దతు ఇవ్వనున్నట్లు తెలంగాణ సీఎంవో వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఇజ్రాయిలీ స్టార్టప్‌లతో కలిసి రాష్ట్రంలో పైలట్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్‌ స్టార్ట్‌పలకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌), డీప్‌టెక్‌ ఇన్నోవేషన్‌తోపాటు హెల్త్‌టెక్‌, అగ్రి-టెక్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఏరోస్పేస్‌ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్ట్‌పలకు ఇజ్రాయెల్‌ మద్దతు ఇవ్వడంతోపాటు భాగస్వామ్యం పంచుకోవాలని చర్చల్లో నిర్ణయించారు.

Also Read :  ఇజ్రాయెల్‌లో ఉద్రిక్తత.. ఐరాస ప్రధానకార్యాలయం కూల్చివేత

హైదరాబాద్‍లో మాస్టర్ కార్డ్ కార్యాలయం

గ్లోబల్ ఫిన్‌టెక్, బీఎఫ్ఎస్ఐ రంగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో అంతర్జాతీయ సంస్థ కార్యాలయం ప్రారంభమైంది. ప్రముఖ గ్లోబల్ పేమేంట్స్ దిగ్గజ కంపెనీ మాస్టర్ కార్డ్ (Mastercard) తన కార్యాలయాన్ని హైదరాబాద్‍లో (Hyderabad Office) ప్రారంభించింది. దావోస్‍‍లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (Davos WEF) వేదికగా మాస్టర్ కార్డు సీఈవో మైఖేల్ మీబాచ్ (Michael Miebach) ఈ కీలక ప్రకటన చేశారు. ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన డిజిటల్ ఎకనామీ, సెబర్ సెక్యూరిటీ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని చెప్పారు.  

FotoJet - 2026-01-21T133035.600

మరికొన్ని సంస్థలు..

పలు అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి, రాష్ట్రంలో తమ కార్యాలయాలు ప్రారంభించడానికి ముందుకొచ్చాయి. ప్రముఖ హెల్త్‌టెక్‌ సంస్థ రాయల్‌ ఫిలిప్స్‌, ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్‌, యూనిలీవర్‌, సౌదీ అరేబియాకు చెందిన ఎక్స్‌పర్టయిజ్‌ వంటి సంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి కనబరిచాయి. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనడానికి దావోస్‌ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధుల బృందం వివిధ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు.

FotoJet - 2026-01-21T133554.104

Advertisment
తాజా కథనాలు