Salman Rushdie: సల్మాన్ రష్దీపై హత్యాయత్నం నిందితుడికి 25 ఏళ్ళ జైలు శిక్ష

అంతర్జాతీయ రచయిత, బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై హత్యాయత్నం కేసులో తీర్పు తీరోజు వెల్లడైంది. ఈ కేసులో దోషిగా ఉన్న న్యూజెర్సీకి చెందిన హాది మతార్ కు 25 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. 2022లో జరిగిన దాడిలో సల్మాన్ రష్దీ ఓ కన్ను కోల్పోయారు. 

New Update
writer

Slaman Rushdie

అంతర్జాతీయ రచయిత సల్మాన్ రష్దీపై మూడేళ్ల క్రితం దాడి జరిగింది. అమెరికాలోని న్యూయార్క్ లోని చౌతాక్వా లోని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆ యన పాల్గొన్నారు. ఇందులో మాట్లాడేందుకు సిద్ధమైన రష్దీపై న్యూజెర్సీకి చెందిన హాది మతార్ అనే దుండుగుడు దాడి చేశాడు. కత్తితో ఆయన తలపై, శరీరంపై దాడిచేశాడు. ఇందులో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఓ కన్నును కూడా కోల్పోయారు.  2022లో ఈ దాడి జరగ్గా..ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఆ కేసు తీర్పు వెలువడింది. ఇప్పటికే జైల్లో ఉన్న నిందితుడికి న్యాయస్థానం 25 ఏళ్ళు జైలు శిక్ష విధించింది.

వివాదాలకు దారితీసిన పుస్తకాలు..

1947లో ముంబయిలో జన్మించిన సల్మాన్‌ రష్దీ..వయసు ప్రస్తుతం 75 ఏళ్ళు. ఈయన ముంబయ్ నుంచి బ్రిటన్ కు తరలివెళ్ళిపోయారు. రష్దీ రచించిన మిడ్ నైట్ చిల్డ్రన్ కు 1981లో బుకర్ ప్రైజ్ వచ్చింది. ఆ తరువాత ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా 1980లో రచించిన ‘ది సాతానిక్‌ వెర్సెస్‌‌’ (The Satanic Verses) నవల అత్యంత వివాదం అయింది. ముస్లిం మతాన్ని కించపరిచే విధంగా ఉందనే విమర్శలు ఎదుర్కొంది. ఇరాన్ 1988లో దీన్ని నిషేధించింది కూడా. ఈ కారణంగానే న్యూయార్క్ లో కూడా రష్దీపై దాడి జరిగింది.

 today-latest-news-in-telugu | writer | new-york | case | jail

Also Read: Celebi: భారత ప్రభుత్వంపై కోర్టుకెక్కిన సెలెబీ సంస్థ

Advertisment
తాజా కథనాలు