Russia-Ukraine: ఉక్రెయిన్‌కు బిగ్ షాకిచ్చిన కిమ్.. తమ మద్ధతు ఆ దేశానికే అంటూ పిలుపు

రష్యా, ఉక్రెయిన్ వార్‌లో భాగంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యాకే తమ మద్ధతు అంటూ పిలుపునిచ్చాడు. తన సాయుధ దళాలను  యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రతీ యుద్ధంలో కూడా శత్రువులను నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉండాలని సైనికులకు పిలుపునిచ్చారు.

author-image
By Kusuma
New Update
kim jong un

kim jong un

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఈ క్రమంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యాకే తమ మద్ధతు అంటూ పిలుపునిచ్చాడు. తన సాయుధ దళాలను  యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కోరారు. నిజమైన యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, ప్రతీ యుద్ధంలో కూడా శత్రువులను నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉండాలని సైనికులకు పిలుపునిచ్చారు. అయితే యూనిట్ సైనికులు సముద్రంలోకి గుండ్లు పేల్చుతున్న దృశ్యాలు తాజాగా కనిపించాయి.

ఇది కూడా చూడండి: Mumbai train blasts case: ముంబై రైలు పేలుళ్ల ఘటన.. 12 మంది నిర్దోషుల తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

డ్రిల్‌ను గమనిస్తున్నట్లు..

కిమ్ ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో కలిసి ఒక పరిశీలన పోస్ట్ నుంచి బైనాక్యులర్ల ద్వారా డ్రిల్‌ను గమనిస్తున్నట్లు ఓ వీడియోలో ఇటీవల కనిపించింది. దక్షిణ కొరియా, పాశ్చాత్య నిఘా వర్గాల సమాచారం ప్రకారం, గత సంవత్సరం రష్యాలోని కుర్స్క్ ప్రాంతానికి దాదాపు 10,000 మంది ఉత్తర కొరియా సైనికులను ఫిరంగి, క్షిపణులు, దీర్ఘ-శ్రేణి రాకెట్ వ్యవస్థలతో మోహరించారు. రష్యా తరపున పోరాడుతున్నప్పుడు కనీసం 600 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించడంతో పాటు వేలాది మంది గాయపడ్డారు. ఉత్తర కొరియా గతంలో రష్యా పట్ల తన విధేయతను వ్యక్తం చేసింది.

ఇది కూడా చూడండి: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, 53 ఏళ్ల నిందితుడు జువైనల్‌ బోర్డుకు తరలింపు..

ఉక్రెయిన్ సంక్షోభానికి మూలకారణాన్ని పరిష్కరించడంలో రష్యా నాయకత్వం తీసుకున్న అన్ని చర్యలకు బేషరతుగా మద్దతు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఇంతకు ముందు ఉత్తర కొరియాతో భద్రతా కూటమిని ఏర్పాటు చేయవద్దని అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లను హెచ్చరించారు. ఉత్తర కొరియాతో సహా ఎవరికైనా వ్యతిరేకంగా రష్యాతో సహా, పొత్తులను నిర్మించడానికి ఈ సంబంధాలను దుర్వినియోగం చేసుకోవద్దని హెచ్చరించింది.

ఇది కూడా చూడండి: Hari Hara Veeramallu:  హరిహర వీర మల్లుకు చంద్రబాబు అభినందనలు..ఎన్నాళ్లనుంచో అంటూ...

ఉత్తర కొరియా తన అణ్వస్త్ర కార్యక్రమాన్ని విస్తరించడానికి ప్రతీకారంగా అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ తమ సైనిక విన్యాసాలను బలోపేతం చేస్తున్న నేపథ్యంలో లావ్‌రోవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల మూడు మిత్రదేశాలు కొరియా ద్వీపకల్పం సమీపంలో సంయుక్త వైమానిక విన్యాసాలు కూడా నిర్వహించాయి. ఇందులో అమెరికా అణ్వస్త్ర సామర్థ్యం గల బాంబర్లు పాల్గొన్నాయి.

ఇది కూడా చూడండి: CM Revanth Reddy : ఖర్గే నివాసానికి చేరుకున్న రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి...రిజర్వేషన్లపై సుదీర్ఘ చర్చలు

Advertisment
తాజా కథనాలు