సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ మృతి చెందారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. అయితే దీనికి సంబంధించి తాజాగా రష్యా కీలక ప్రకటన చేసింది. బషర్ అల్-అసద్ బ్రతికే ఉన్నారని పేర్కొంది. కానీ ఆయన జాడ గురించి మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఇదిలాఉండగా.. ఆదివారం సిరియా దేశం మొత్తాన్ని కూడా రెబల్స్ పూర్తిగా ఆక్రమించేశారు. దీంతో బషర్ ఆల్-అసద్.. తన అధ్యక్ష పదవి బాధ్యతలు రెబల్స్‌కు అప్పగించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో పారిపోయారు. Also Read: ధరణిలో మార్పులు, కొత్త ఆర్‌వోఆర్ చట్టం.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు అయితే వారు వెళ్తున్న ఆ విమానాన్ని రెబల్స్ కూల్చివేశారని.. దీంతో బషర్ ఆల్-అసద్‌తో పాటు తన కుటుంబు సభ్యులు మరణించారనే వార్తలు రావడం దుమారం రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన బషర్ బ్రతికే ఉన్నాడని రష్యా చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సిరియాలో శాంతియుతంగా అధికారాన్ని అప్పగించాలని రెబల్స్ ఆదేశాలు ఇవ్వడం వల్ల బషర్ తన పదవిని వదిలిపెట్టారని.. ఆ తర్వాత దేశం విడిచి వెళ్లిపోయారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. Also Read: CAPF, అస్సాం రైఫిల్స్‌లో 1,00,204 ఉద్యోగ ఖాళీలు.. అయితే బషర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో రష్యా చెప్పలేదు. దేశం వదిలి వెళ్లే సమయంలో జరిపిన చర్చల్లో తాము పాల్గొనలేదని తెలిపింది. సిరియాని రెబల్స్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో రష్యా సైనిక స్థావరాలను హై అలర్ట్‌లో ఉంచామని.. కానీ వాటికి ఎలాంటి ముప్పు లేదని తెలిపింది. ఇదిలాఉండగా.. 2015లో సిరియాలో తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా బషర్ అసద్ ప్రభుత్వానికి రష్యా మద్దతుగా నిలిచింది. ఆ సమయంలో రెబెల్స్‌పై దాడులకు కూడా పాల్పడింది. అయితే తాజాగా బషర్ పదవిని విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలను కూడా రష్యా పరిశీలిస్తోంది. Also Read: ఈవీఎంలపై విపక్షాల అనుమానాలు.. స్పందించిన షిండే ! Also Read: ఆన్‌లైన్‌లో స్టిక్కర్లు అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్న బాలుడు