/rtv/media/media_files/2026/01/01/russia-says-24-killed-in-drone-attack-in-occupied-kherson-region-2026-01-01-13-55-18.jpg)
Russia Says 24 Killed in Drone Attack in Occupied Kherson Region
రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి చేపట్టింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖేర్సన్ ప్రాంతంలోని ఓ కేఫ్ అంట్ హోటల్‌పై ఈ దాడి జరిగింది. కొత్త సంవత్సరం వేడుకల వేళ ఉక్రెయిన్ ఈ దాడులు చేసినట్లు ఖేర్సన్ గవర్నర్ తెలిపారు.
Also Read: సిగరెట్, పాన్ మసాలాపై 40 శాతం జీఎస్టీ.. ఎప్పటినుంచంటే ?
ఇదిలాఉండగా డిసెంబర్ 28 నుంచి 29 మధ్య పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు రష్యా ఆరోపిస్తోంది. కానీ ఉక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఉక్రెయిన్ దాడులు చేయడం కలకలం రేపుతోంది. మరోవైపు ట్రంప్ ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
Also Read: న్యూఇయర్ వేడుకల్లో విషాదం.. బార్‌లో 10 సజీవదహనం
పుతిన్ ఇంటిపై దాడులు జరగిన తర్వాత ఆయన ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అయితే ఈ దాడిపై ట్రంప్ కోపంతో ఉన్నట్లు పుతిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ వెల్లడించారు. అంతేకాదు తాము ఉక్రెయిన్‌కు క్షిపణులు ఇవ్వలేదని ట్రంప్ చెప్పినట్లు తెలిపారు. ఉక్రెయిన్ 91 లాంగ్ రేంజ్ డ్రోన్లతో పుతిన్ ఇంటిపై దాడులు చేసినట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ వెల్లడించారు. దాడులు చేసిన కూడా తాము శాంతి ఒప్పందాలను ఉపసంహరించుకోమన్నారు. శాంతి ప్రయత్నాలను పక్కదారి పట్టించేందుకే ఈ దాడులు చేశారని విమర్శించారు. ప్రతీకార చర్యల కోసం రష్యా లక్ష్యాలను ఎంచుకుందన్నారు. అయితే ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. ఇలాంటి తరుణంలో రష్యాపై ఉక్రెయిన్ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us