BREAKING: న్యూఇయర్ వేడుకల్లో విషాదం.. బార్‌లో 10 సజీవదహనం

కొత్త ఏడాది వేళ స్విట్జర్లాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ, స్విట్జర్లాండ్‌లోని ఓ రిసార్ట్ బార్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో పది మంది సజీవదహనమయ్యారు.

New Update
Switzerland

కొత్త ఏడాది వేళ స్విట్జర్లాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ, స్విట్జర్లాండ్‌లోని ఓ రిసార్ట్ బార్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో పది మంది సజీవదహనమయ్యారు. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. నైరుతి స్విట్జర్లాండ్‌లోని వాలైస్ కాంటన్‌లో ఉన్న ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ క్రాన్స్-మోంటానా. గురువారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో, అక్కడి 'లే కాన్‌స్టెలేషన్' బార్ అండ్ లాంజ్‌లో పర్యాటకులు, స్థానికులు పెద్ద ఎత్తున నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. ఆ సమయంలో బార్‌లో సుమారు 100 మందికి పైగా జనం ఉన్నట్లు సమాచారం.

ఒక్కసారిగా పెద్ద సౌండ్‌తో బ్లాస్ట్ జరిగి బిల్డిండ్‌లో మంటలు దట్టమైన పొగతో నిండిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్న వారు బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ తోపులాటలో 10 మంది అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అత్యవసర వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. హెలికాప్టర్లు, అంబులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం, దీనివల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కాల్చిన బాణసంచా వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని కొన్ని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. వాలైస్ కాంటనల్ పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఈ విషాద ఘటనతో స్విట్జర్లాండ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisment
తాజా కథనాలు