/rtv/media/media_files/2025/04/09/TPZvjpBq8Isq9lh0XBrd.jpg)
Russia Responds Trump's Tariffs
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్‌లతో ట్రేడ్ వార్ మొదలైంది. చైనాపై 104 శాతం విధించిన ట్రంప్ సర్కార్‌కు చైనా షాక్ ఇచ్చింది. చైనా కూడా 84 శాతం అమెరికా దిగుమతి వస్తువులపై టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇలా ట్రేడ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా రష్యా స్పందించింది. అమెరికా ప్రభుత్వం విధించిన సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రాథమిక నిబంధనలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయని.. రష్యా విదేశాంగ ప్రతినిధి మారియా జఖరోవా అన్నారు.
Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్
వాషింగ్టన్ ఇకనుంచి అంతర్జాతీయ వాణిజ్య చట్ట నియమాలకు కట్టుందని ఉండవని ఈ టారిఫ్‌లు నిరూపిస్తున్నాయని అన్నారు. ఇదిలాఉండగా ట్రంప్ వివిధ దేశాలపై పరస్పర సుంకాలు విధించడంతో స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. దీంతో అనేక వ్యాపార రంగాలు కుదేలవుతున్నాయి. ముడి చమురు ధరలు కూడా రోజురోజుకి పడిపోతున్నాయి. రష్యాకు ఇది మరింత ఆందోళనకరంగా మారింది.
చమురు, ఖనిజ ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయంపైనే రష్యా ఆధారపడుతోంది.
Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
కానీ ఇప్పుడు సంక్షోభ భయాలను ఎదుర్కొంటోంది. రష్యా ఫెడరల్ బడ్జెట్‌కు ఎక్కువగా చమురు, గ్యాస్ రంగం నుంచే వస్తుంటాయి. కానీ ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావానికి గత కొన్ని రోజులుగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో రష్యా ఆదాయానికి గండి పడినట్లయ్యింది. ఏప్రిల్‌లో మరింత నష్టం జరగొచ్చని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కూడా.. ట్రంప్ పుతిన్ ప్రభుత్వానికే మద్దతిస్తున్నారు. కానీ తాజాగా రష్యా కూడా అమెరికా సుంకాలను వ్యతిరేకిస్తూ స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!