Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ

ఇండియన్ స్టూడెంట్స్ కు గూగుల్ బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఏడాది పాటూ ఫ్రీగా ఏఐ టూల్స్ ను వాడుకోవచ్చని చెప్పింది. జెమినీ ఫర్‌ స్టూడెంట్స్ పేరుతో 18 ఏళ్ళు పైబడిన విద్యార్థులు ఉచిత  సబ్ స్క్రిప్షన్ పొందవచ్చును. 

New Update
gemini

Google Gemini AI

ప్రస్తుతం నడుస్తున్నది అంతా ఏఐ యుగం. మఖ్యంగా విద్యార్థులు ఇందులో నైపుణ్యం సంపాదించకపోతే కానీ వీు లేని పరిస్థితి. ఇది దృష్టిలో పెట్టుకునే గుగూల్ వారికి గుడ్ నయూ్ చెప్పింది. గూగుల్‌ అడ్వాన్స్‌డ్‌ ఏఐ టూల్స్‌ను ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. జెమినీ ఫర్ స్టూడెంట్స్ పేూరుతో ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. 18 ఏళ్ళు పైబడిన విద్యార్థులు ఏాది పాటూ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను పొందవచ్చును. దీంతో పాటూ 2 టీబీ క్లౌడ్‌ స్టోరేజీ కూడా ఉచితంగా లభిస్తుంది.

అడ్వాన్స్ టూల్స్ అన్నీ..

జెమినీ ఏఐ ఉచితంగా ఉపయోగించుకోవాలంటే ముందు గూగుల్ ఆఫర పేజీ లో నమోదు చేసుకోవాలి. సెప్టెంబర్ 15లోపు దీనిని పూర్తి చేయాలి. ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత గూగుల్‌లో పవర్‌ఫుల్‌ ఏఐ మోడల్‌ అయిన జెమినీ 2.5 ప్రోను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో చదువుకోడానికి, రైటింగ్‌, రీసెర్చ్, ఉద్యోగానికి సంబంధించి కావాల్సిన టూల్స్‌ ఉన్నాయి. ఇందులో అన్ లిమిటె్ అకడమిక్ సపోర్ట్, నోట్ బుక్ ఎల్ఎం, జమినీ లైవ్, వియో 3, డీప్ రీసెర్చ్ టూల్స్ ను ఉయోగించుకోవచ్చును. మామూలుగా ఇవి వినియోగించాలంటే రూ.19,500 కట్టాల్సి ఉంటుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు