Elon Musk: ఎలాన్ మస్క్‌కు రష్యా బంపర్‌ ఆఫర్‌..

ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా మస్క్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో పొలిటికల్ అసైలమ్ (రాజకీయ శరణార్థి)గా ఉండేందుకు ఎలాన్‌ మస్క్‌కు ఛాన్స్ ఇస్తామని ప్రకటన చేసింది.

New Update
Russia Offers Elon Musk Political Asylum Amid Feud With Donald Trump

Russia Offers Elon Musk Political Asylum Amid Feud With Donald Trump

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎప్‌స్టీన్ సెక్స్‌ కుంభకోణంలో ట్రంప్‌ పేరుందని మస్క్‌ బయటపెట్టడంతో వీళ్లిద్దరీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా మస్క్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో పొలిటికల్ అసైలమ్ (రాజకీయ శరణార్థి)గా ఉండేందుకు ఎలాన్‌ మస్క్‌కు ఛాన్స్ ఇస్తామని ప్రకటన చేసింది. రష్యాకు చెందిన స్టేట్‌ డూమా ఫెడరేషన్ కమిటీ ఛైర్మన్ దిమిత్రి నోవికోట్‌ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.  

Also Read: ఆ అడవుల్లో రూ.70 వేల కోట్ల విలువైన వజ్ర నిక్షేపాలు

'' ఎలాన్‌ మస్క్‌ భిన్నమైన ఆట ఆడుతారని నేను భావిస్తున్నాను. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండండం అవసరం లేదు. కానీ మస్క్‌కు అలా ఉండాలనుకుంటే రష్యా సహకరిస్తుందని''  దిమిత్రి నోవికోట్‌ అన్నారు. అయితే గతంలో అమెరికాకు చెందిన స్నోడెన్‌కు రష్యా తమ దేశంలో పొలిటకల్ అసైలమ్‌గా ఆశ్రయం కల్పించింది. మస్క్‌కు కూడా అలాగే అవకాశం కల్పిస్తారా అని అడిగిన ప్రశ్నకు దిమిత్రి నోవికోట్‌ కల్పిస్తామంటూ సమాధానం ఇచ్చారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో డెమోక్రట్లు రావాలని ఎలాన్ మస్క్‌ కోరుకోవడం లేదని తాను భావిస్తున్నట్లు దిమిత్రి చెప్పారు. 

మరోవైపు ట్రంప్‌, మస్క్‌ మధ్య నెలకొన్న వివాదంలో జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ నిరాకరించారు. ఇది అమెరికా సమస్య అని.. ఇందులో జ్యోకం చేసుకునే ఉద్దేశం లేదని చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.  ఇదిలాఉండాగా ఈ ఏడాది మే లో తీసుకొచ్చిన రిపబ్లికన్ ట్యాక్స్‌ బిల్లును ఎలాన్ మస్క్‌ వ్యతిరేకించారు. దీంతో అప్పటి నుంచి ట్రంప్, మస్క్‌ మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. 

Also read: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్‌లైన్‌లో రూ.3.85 కోట్లు స్వాహా

అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌కు సపోర్ట్‌ చేసిన మస్క్‌.. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎక్స్‌లో ట్రంప్‌పై వరుస ట్వీట్లతో మస్క్‌ విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఓ యూజర్‌ ట్రంప్‌ను అభిశంసించి.. ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని పోస్ట్‌ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్‌ మస్క్‌.. ఆ పోస్టును సమర్థించాడు. ఈ పోస్టును గుర్తుపెట్టుకోవాలని.. భవిష్యత్తులో ఇదే జరుగుతుందని రాసుకొచ్చారు. అలాగే ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరు ఉందని.. అందుకే ఆ ఫైల్స్‌ వివరాలు బయటపెట్టడం లేదని మస్క్‌ ఎక్స్‌లో మరో పోస్ట్‌ చెయడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఎలాన్ మస్క్, ట్రంప్‌ మధ్య వివాదం చర్చనీయాంశమవుతోంది. 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు