Afghanistan: రెండు రోజులైనా అవ్వలేదు..ఆఫ్ఘనిస్థాన్ లో మళ్ళీ భూకంపం

ఇంకా శిథిలాల కింద మృతదేహాలను పూర్తిగా వెలికి తీయనే లేదు. 48 గంటలు గడవక ముందే మరోసారి భూ ప్రకంపనలు ఆఫ్ఘనిస్థాన్ ను వణికించాయి. తూర్పు ఆఫ్ఘాన్ లో రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. 

New Update
Afghan

Afghanistan Earth Quake

ఆదివారం రాత్రి రెక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆప్ఘనిస్తాన్ ను అతలాకుతలం చేసేసింది. ఆ దేశానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. దాదాపు 1400 మందిని పొట్టన పెట్టుకుంది. మరో 3,,124 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ భూకంపం ధాటికి గ్రామాలకు గ్రామాలే కుప్పకూలిపోయాయి. భూకంపం ఆదివారం రాత్రి 11:47 గంటల సమయంలో సంభవించింది. ఈ సమయంలో చాలా మంది ప్రజలు గాఢ నిద్రలో ఉండటంతో ప్రాణ నష్టం అధికంగా సంభవించింది. భూకంపం ప్రభావం కునార్, లాఘ్మాన్, నంగర్‌హార్ ప్రావిన్సులపై ఎక్కువగా పడింది. అనేక చోట్ల ఇళ్లు, భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా కునార్ ప్రావిన్స్‌లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.  రెండు రోజుల నుంచీ శిథిలాలను తవ్వుకోవడంలోనే ఉన్నారు అక్కడి జనాలు. తమ ఆప్తులను రక్షించుకునేందుకు అనేక మంది చేతులతో మట్టిని తవ్వుతున్నారు. 

మళ్ళీ భూప్రకంపనలు..

ఆఫ్ఘాన్ లో ఈ విపత్తు జరిగి పూర్తిగా 48 గంటలు కూడా అవ్వలేదు. మళ్ళీ అక్కడ భూమి ప్రకంపించింది. ఈ సారి తూర్పు ఆ ఫ్ఘనిస్తాన్ లో భూ కంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదైయ్యాయని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. నంగర్హార్‌ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌ నగరానికి ఈశాన్యంలో 34కి.మీల దూరంలో  భూకంపం కేంద్ర ఉందని చెప్పింది. అయితే అదృష్టవశాత్తు ఈసారి పెద్దగా ఏమీ జరగలేదు. భూమి కంపించినప్పటికీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. 


మరోవైపు ఆదివారం సంభవించిన భూకంపం ప్రాంతాలు కొండలు, లోయలు కావడంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసం కావడంతో సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడానికి చాలా సమయం పడుతోంది. శిథిలాల కింద ఇంకా ఎంతోమంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read: అయ్యో.. ఓనమ్ వేడుకల్లో విషాదం.. డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఉద్యోగి!

Advertisment
తాజా కథనాలు