Elon Musk: బైడెన్ తిరస్కరిస్తే..ట్రంప్ తీసుకొచ్చారు..ఎలాన్ మస్క్

భూమి మీదకు వ్యోమగాములు సురక్షితంగా రావడంపై స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ స్పందించారు. వారి రాకపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన అధ్యక్షుడు ట్రంప్ కు థాంక్స్ చెప్పారు. పనిలో పనిగా మరోసారి బైడెన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

author-image
By Manogna alamuru
New Update
Elon Musk

Elon Musk

జూన్ 6న సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు రోదసిలోకి వెళ్ళారు. అదే నెలలో 14న వెనక్కు తిరిగి వచ్చేయాలి. లేట్ అయినా నెలలోపు భూమి మీదకు చేరుకోవాలి. కానీ తొమ్మిది నెలల తర్వాత ఈరోజు భూమి మీదకు వచ్చారు. దానికి కారణం బైడెన్ ప్రభుత్వమే అంటున్నారు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. బైడెన్ ప్రభుత్వం వ్యోమగాములను పట్టించుకోలేదు. వారిని వదిలేయమని చెప్పింది. తాము ఎంత అడిగినా సరైన సమయానికి డెసిషన్ తీసుకోలేదు. అందువల్లే సునీతా విలియమ్స్, బుచ్ లు అంతరిక్షంలో చిక్కుకుపోయారని మస్క్ ఇంతకు ముందు చెప్పారు. ఇప్పుడు ఈరోజు వ్యోమగాములు భూమి మీదకు సురక్షితంగా తిరిగి వచ్చిన సందర్భంలో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ...బైడెన్ ప్రభుత్వం మీద మరోసారి విరుచుకుపడ్డారు మస్క్. 

Also Read :  మహానందిలో విషాదం.. శివ క్షేత్రంలో ఇద్దరు మృతి

Also Read :  ఇక నుంచి ఆ పుణ్య క్షేత్రంలో మద్యం, మాంసం విక్రయాలు బంద్..!

ట్రంప్ కు కృతజ్ఞతలు..

తొమ్మది నెలలు అంతరిక్షంలో ఉండిపోయి ఈరోజు భూమి మీదకు వచ్చిన వ్యోమగాముల విషయంలో ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. వారిని తిరిగి తీసుకురావాలని అధ్యక్షుడు ట్రంప్‌ స్పేస్ఎక్స్‌ని కోరారని తెలిపారు. వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చిన స్పేస్‌ఎక్స్‌, నాసా బృందాలకు, శాస్త్రవేత్తలకు ఎలాన్ మస్క్‌ అభినందనలు తెలిపారు. 

Also Read :  గుజరాత్‌లో సునీతా విలియమ్స్ బావ యజ్ఞం

ట్రంప్ , వైట్ హౌస్ స్పందనలు..

ట్రూత్ సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సునీతా విలియమ్స్, మిగతా ఆస్ట్రోనాట్స్ కు స్వాగతం పలికారు. వారి ఫోటోలను షేర్ చేస్తూ ట్రూత్ లో పోస్ట్ పెట్టారు. అలాగే వైట్ హౌస్ కూడా దీనిపై స్పందించింది. ప్రామిస్ మేడ్‌.. ప్రామిస్ కెప్ట్ అని ఎక్స్ లో పోస్ట్ పెట్టింది.   తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకొస్తామని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు అని వైట్‌హౌస్ అందులో రాసింది. ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, నాసాలకు అభినందనలు తెలిపింది.

Also Read: USA: ట్రంప్ కు ఫెడరల్ కోర్టు నుంచి మరో ఎదురు దెబ్బ..ఆ నిషేధాన్ని నిలిపేయాలని..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు