/rtv/media/media_files/2026/02/08/ramesh-chandra-sen-2026-02-08-13-48-37.jpg)
Ramesh Chandra Sen, Bangladesh Hindu leader from Sheikh Hasina's party, dies in jail
బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై వివక్ష కొనసాగుతోంది. తాజాగా మరో హిందూ నేత అక్కడ ప్రాణాలు కోల్పోయారు. అవామీ లీగ్‌కు చెందిన మాజీ నేత రమేషన్ చంద్రసేన్(Ramesh Chandra Sen) (86) 18 నెలలుగా జైల్లోనే శిక్ష అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. విద్యావేత్త అయిన చంద్రసేన్ గతంలో బంగ్లాదేశ్ ఎంపీగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఏ తప్పు చేయనప్పటికీ 18 నెలలుగా జైల్లోనే మగ్గిపోయారు. దీంతో ఆయన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది.
Bangladesh Hindu Leader From Sheikh Hasina's Party
తన ఆరోగ్యం క్షీణించిందని పలుమార్లు ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. కానీ కోర్టు నుంచి బెయిల్ రాలేదు. చివరికి ఆయన ఆరోగ్యం విషమించింది. జైల్లోనే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. 18 నెలలుగా ఆయన జైల్లో ఉన్నప్పటికీ ప్రజాధారణ ఏమాత్రం తగ్గలేదు. బంగ్లాదేశ్‌లో ఆయన గతంలో విద్యారంగం, రాజకీయాల్లో కీలక సేవలందించారు.
Also Read: అనిల్ అంబానికి స్వీడన్ మహిళను ఆఫర్ చేసిన ఎప్‌స్టీన్.. వెలుగులోకి సంచలన నిజాలు
18 నెలల క్రితం ఓ అల్లరిమూక ఆయనపై దాడి చేసింది. అయినప్పటికీ పోలీసులు చంద్రసేన్‌నే అరెస్టు చేశారు. అరెస్టు చేయడానికి గల కారణాలు కూడా సరిగ్గా చెప్పలేదు. దీంతో అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఓ కేసు తర్వాత మరో కేసు పెడుతూ వచ్చారు. ఏదైనా కేసులో బయటకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇంకో కేసుతో జైలు నుంచి విడుదల కాకుండా చేశారు. ఇదిలాఉండగా ఇటీవలే అవామీ లీగ్‌కు చెందిన మరో హిందూ నేత ప్రళయ చాకీ కూడా పోలీసుల కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయాడు.
Follow Us