Trump Warning: ఆదివారం వరకే గడువు..లేకపోతే నరకమే..హమాస్ కు ట్రంప్ మాస్ వార్నింగ్

హమాస్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ డెడ్ లైన్ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు యుద్ధం ముగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని.. నరకం చూపిస్తామని హెచ్చరించారు. 

New Update
Trump

Trump

గాజాప్రణాళికపై ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. తాను రూపొందించి 21 సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పారు. దీని కోసం హమాస్ కు డెడ్ లైన్ విధించారు. ఆదివారం సాయంత్రం ఆరు లోపు ఒప్పందానికి రావాలని చెప్పారు. అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని..నరకం చూపిస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

trump

ఇజ్రాయెల్ అంగీకారం..

ట్రంప్ శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్ ఇప్పటికే అంగీకారం తెలిపింది. దీంతో పాటూ ముస్లిం దేశాలు కూడా ఓకే చేశాయి. ఇప్పుడు హమాస్ మాత్రమే దీనిపై స్పందించాల్సి ఉంది. ఒకవేళ హమాస్ కనుక ప్రణాళిక అంగీకరిస్తే.. అందుకు తగ్గట్టుగానే  72 గంటల్లో బందీలను విడుదల చేయాలి. అలాగే ఆ సంస్థ ఆయుధాలను వదిలేయాలి. గాజాను నిరాయుధీకరణ చేయాలి. ఇవన్నీ అయిన తరువాత అంతర్జాతీయ పాలకవర్గం ఏర్పాటు కావాలని నెతన్యాహు కోరారు. అది విజయవంతం అయితే కచ్చితంగా మొత్తం యుద్ధం ముగిస్తామని తెలిపారు.  అయితే గాజా నుంచి సైన్యం వచ్చేసినా...చుట్టుపక్కల మాత్రం ఉంటుందని..అది తమ సెక్యూరిటీ కోసమని చెప్పారు.  ఇప్పుడు అమెరికా రూపొందించిన శాంతి సూత్రాలను హమాస్ కూడా అంగీకరించాలని నెతన్యాహు కోరారు. అలా చేయకపోతే..దాన్ని అంతం చేస్తామని హెచ్చరించారు.

మరోవైపు బుధవారం తీవ్ర దాడులతో మరోసారి గాజాపై విరుచుకుపడింది ఐడీఎఫ్. దీని కారణంగా గాజా నగరాన్ని వదిలేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ అక్కడి ప్రజలను హెచ్చరించారు. ఇదే తమ చివరి హెచ్చరిక అని తెలిపారు. అలా వెళ్ళకుండా ఉండిపోయిన వారిని తీవ్రవాదులుగానే పరిగణిస్తామని తెలిపారు. గాజా స్ట్రిప్ ఉత్తర భాగంలో ఉన్న వారు దక్షిణ భాగానికి వెళ్లిపోవాలని చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే నెట్‌జారిమ్ కారిడార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కాట్జ్ చెప్పారు. ఇప్పుడు గాజా నగరాన్ని వదిలి వెళ్లే వారు ఇజ్రాయిల్ సైనిక పోస్టుల గుండా వెళ్లాల్సి వస్తుందని కాట్జ్ తెలిపారు.  

Also Read: పవన్‌ కళ్యాణ్, రిషబ్‌ షెట్టికి షాక్.. ఆ దేశంలో సౌత్ ఇండియన్ సినిమాలు నిలిపివేత

Advertisment
తాజా కథనాలు