Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడికి క్యాన్సర్.. రేడియేషన్ థెరపీ చికిత్స

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మే నెలలో ఆయనకు ప్రోస్టేట్ క్యాన్సర్ డిటెక్ట్ అయిందని..అప్పటి నుంచి రేడియేషన్ థెరపీలో ఉన్నారని తెలిపారు. 

New Update
Joe Biden

Joe Biden

ఎన్నికలకు ముందు నుంచీ అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యంగా లేరని చెబుతూనే ఉన్నారు. ఉన్నట్టుండి బ్లాంక్ అయిపోవడం, అన్నీ మర్చిపోతుండడంతో ఆయన్ను డెమోక్రాట్ అభ్యర్థిగా తప్పించి...ఆ స్థానంలో కమలా హారిస్ ను నిలబెట్టారు. బైడెన్ ఆరోగ్యాన్ని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నికలకు ఆయుధంగా కూడా చేసుకున్నారు. అయితే అప్పట్లో జో బైడెన్ కు ఏమైందనేది ఎవరికీ తెలియలేదు. ఆయనకు వచ్చిన అనారోగ్యం ఏంటనేది ఎవరూ చెప్పలేదు. వృద్ధాప్యం వల్లనే బైడెన్ అలా ప్రవర్తిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. 

రేడియేషన్ థెరపీకి బైడెన్..

అయితే తాజాగా జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిందని తెలుస్తోంది. దీని కోసం ఆయన రేడియేషన్ థేరపీ తీసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ బైడెన్ ఎముకల్లో వ్యాపించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వయసు 83 ఏళ్ళు. అయితే ఈ వయసులో కూడా బైడెన్ శరీరం రేడియేషన్ థెరపీకి సహకరిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. మాజీ అధ్యక్షుడికి క్యాన్సర్ ఉన్నట్టు మే నెలలోనే డయాగ్నోస్ చేశారు. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్ చాలా తీవ్రమైనదని..ఇది ఎముకల్లో వ్యాపిస్తుంది కాబట్టి నివారణ అంత సులభం కాదని అంటున్నారు. వైద్యపరిభాషలో దీనిని "మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్" అంటారని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇది హార్మోన్ సెన్సిటివ్ అని...చికిత్స ద్వారా నయం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం బైడెన్ కు హార్మోన్ చికిత్స్ చేస్తున్నారు. ఇక గత నెల సెప్టెంబర్ లో ఆయనకు ఒక ఆపరేషన్ కూడా జరిగింది. నుదిటిపై ఉన్న చర్మ క్యాన్సర్ కణాలను తొలగించారు. ఈ ప్రక్రియను "మోహ్స్ సర్జరీ" అంటారు. అన్ని క్యాన్సర్ కణాలను విజయవంతంగా తొలగించినట్లు వైద్యులు తెలిపారు. అయితే వీటన్నింటికీ బైడెన్ శరీరం ఫుల్ గా సపోర్ట్ చేస్తోంది. ఆయన కూడా తాను మానసికంగా బలంగా ఉన్నానని చెబుతున్నారు. 

Also Read: Egypt: సీజ్ ఫైర్ సమ్మిట్ సమీపంలో కారు బోల్తా..ముగ్గురు ఖతార్ డిప్లొమాట్లు మృతి

Advertisment
తాజా కథనాలు