Pakistan: అసీమ్‌ మునీర్‌కు అధ్యక్ష పదవి !.. పాక్ ప్రధాని సంచలన ప్రకటన

పాకిస్థాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీని గద్దె దింపి ఆ పదవిని చేపట్టాలని ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ప్రధాని షెహబాజ్ షరీఫ్ అవన్నీ కేవలం పుకార్లేనంటూ స్పష్టం చేశారు.

New Update
Pakistan PM Shehbaz Sharif rejects claims of Army Chief replacing President Zardari

Pakistan PM Shehbaz Sharif rejects claims of Army Chief replacing President Zardari

పాకిస్థాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీని గద్దె దింపి ఆ పదవిని చేపట్టాలని ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై ఆ దేశ ప్రధాని షెహబాద్ షరీఫ్ స్పందించారు. ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అవన్నీ కేవలం పుకార్లేనంటూ తేల్చిచెప్పారు. అలీ జర్దారీ ఐదేళ్ల పూర్తికాలం అధ్యక్షుడిగా ఉండాడని స్పష్టం చేశారు. అసిమ్ మునీర్ అధ్యక్ష పదవిపై ఎప్పుడూ కూడా ఆసక్తి చూపలేదని.. అసలు అలాంటి ప్లాన్ కూడా లేదని చెప్పారు. 

Also read: 17 రోజుల్లో 30 పుణ్యక్షేత్రాలు.. అదిరిపోయే ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్

అసీమ్ మునీర్, జర్దారీకి సానుకూల సంబంధాలు ఉన్నాయని తెలిపారు. పాక్‌ అభివృద్ధే వీళ్లి్ద్దరి లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు దీనిపై పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహ్సిన్ నక్వీ ఎక్స్‌లో స్పందించారు. '' జర్దారీ, అసిమ్ మునీర్, షరీఫ్‌లను టార్గెట్ చేసుకొని తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీని వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని మాకు తెలుసు. జర్దారీ స్థానంలో అసీమ్ మునీర్ వస్తారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. దీనిపై ఎలాంటి చర్చలు జరగలేదు, అలాంటి ఆలోచన కూడా లేదని'' తెలిపారు. ఆ తర్వాత ప్రధాని షెహబాజ్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు.   

Also Read: భారత్‌ అరుదైన ఘనత.. WHO నివేదికలో ప్రత్యేక గుర్తింపు

ఇదిలాఉండగా అణు కార్యక్రమంపై కూడా షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. అణు కార్యక్రమం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని తెలిపారు. దేశ రక్షణ కోసమే వాటిని వాడుతామన్నారు. భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో 55 మంది పాక్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు