Pakistan PM : ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం : పాక్ ప్రధాని సంచలన ప్రకటన

భారత్ నిన్న రాత్రి చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని..  ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రధాని తెలిపారు. భారత్ కు ఎలా బదులివ్వాలో తమకు తెలుసునని అన్నారు.

New Update
pak-pm

pak-pm

పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్  'ఆపరేషన్ సింధూర్' చేపట్టిన తర్వాత పాకిస్తాన్ లో భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ దేశ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ బుధవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సంచలన ప్రకటన చేశారు. భారత్ నిన్న రాత్రి చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని..  ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు.  భారత్ కు ఎలా బదులివ్వాలో తమకు తెలుసునని అన్నారు. చనిపోయిన సాయుధ దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందని పేర్కొన్నారు.  వారి ధైర్యం, త్యాగాలకు మొత్తం దేశం గర్విస్తుందని అన్నారు.

Also Read :  LOC వెంబడి కాల్పులు జరిపిన పాక్‌ ఆర్మీ.. తిప్పికొట్టిన భారత్!

Also Read :  జమ్మూ కశ్మీర్‌లోని మళ్లీ కాల్పులు

Indian Missile Strikes On Terror Targets

తమ దేశాన్ని రక్షించుకోవడానికి చివరి శ్వాస వరకు పోరాడుతామని అన్నారు.  భారత్ చర్యల కారణంగా ఇప్పటివరకు 26 మంది పాక్ ప్రజల ప్రాణాలు కోల్పోయారని, వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని పాక్ ప్రధాని పేర్కొన్నారు. 40 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు.  మృతులను అమరవీరులుగా అభివర్ణించిన ఆయన, పాకిస్తాన్ మొత్తం ఈ అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని అన్నారు. మరోవైపు ఇస్లామాబాద్ లో  ప్రజలు ఇళ్లలోకి వెళ్లాలని, లైట్లు ఆర్పేయాలని ఆర్మీ మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తోంది.

Also Read :  పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 14 మంది సైనికులు హతం

Also Read :  వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

 

pakistan pm sherif requests un

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు