/rtv/media/media_files/2025/09/29/asia-cup-2025-celebrations-in-pakistan-too-2025-09-29-20-31-49.jpg)
Asia Cup 2025 Celebrations in Pakistan too
Asia Cup 2025: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా విజేతగా నిలిచింది.సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆద్యాంతం ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్ విజయాన్ని దేశమంతా సంబురాలు చేసుకుంది. మరే ఇతర దేశపై గెలిచినా సాధారణంగా తీసుకునే భారతీయులు పాక్ పై విజయాన్ని మాత్రం గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకుంటారు. దానికి కారణం పాక్‌తో మనకున్న వైరమే. అయితే ఈ విజయాన్ని కేవలం ఇండియాలోనే కాదు పాకిస్థాన్‌లోనూ సెలబ్రేట్ చేసుకున్నారంటే కొంత వింతగా అనిపిస్తుంది. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. కేవలం సెలబ్రెట్ చేసుకోవడమే కాదు జై హింద్ అంటూ నినాదాలు కూడా చేయడం గమనార్హం. ఇంతకీ ఆ సెలబ్రేషన్ చేసుకుంది ఎవరో తెలుసా.. ఆఫ్ఘనిస్థాన్ విద్యార్థులు. వీరంతా పాకిస్తాన్‌లో చదువుకుంటున్నారు. టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ ఆఫ్ఘన్ విద్యార్థులు “జై హింద్” అని నినాదాలు కూడా చేయడం విశేషం.
Afghanistan students in Pakistan chanting 'Jai Hind' after India's Asia Cup win. 🤯 pic.twitter.com/ndMq0fqhWx
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2025
అఫ్ఘాన్ విద్యార్థులు నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అఫ్ఘాన్ విద్యార్థులు గుంపులు గుంపులుగా చేరి ఉత్సవాలు జరుపుకుంటున్న దృశ్యాలు, వారి నినాదాలు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే నెటిజన్లు కామెంట్లతో దుమ్ము లేపుతున్నారు. ఒకరు “ఆఫ్ఘనిస్తాన్ ఇండియా భాయ్ భాయ్” అంటే. మరొకరు “భారత్, ఆఫ్ఘనిస్తాన్ లోతైన శాశ్వతమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి” అని కామెంట్ చేయడం గమనార్హం.
నిజానికి భారత్, ఆఫ్గాన్ మధ్య మంచి స్నేహవాతావరణం ఉన్న విషయం మనకు తెలిసిందే. బీసీసీఐ సైతం ఆఫ్ఘాన్‌లో క్రికెట్ అభివృద్ధి కోసం నిధులు సైతం కేటాయించింది, ఆ దేశంలో క్రికెట్ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించింది. అంతేకాక ఆఫ్ఠాన్ ప్లేయర్లకు క్రికెట్ శిక్షణ కూడా ఇప్పించింది. ఇలా ఆఫ్టాన్ క్రికెట్ కోసం భారత్ ఎంతో తోడ్పాటునందించింది. అందుకే ఆఫ్ఘాన్ పౌరులకు టీమిండియా అంటే అభిమానం. వేరే దేశంతో ఆడుతున్న సమయంలోనూ చాలా మంది ఆఫ్ఠాన్ పౌరులు టీమిండియాకే మద్ధతుగా నిలుస్తుంటారు.
ఇది కూడా చదవండి: డివైడర్ దాటి టెంపో పైకి దూసుకెళ్లిన మరో టెంపో! ఘోరమైన యాక్సిడెంట్