/rtv/media/media_files/2025/09/28/pune-accident-2025-09-28-17-55-57.jpg)
pune accident
Accident: ఈ మధ్య రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువవుతోంది. అధికారులు కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించినప్పటికీ.. కొంతమంది కనీస బాధ్యత లేకుండా రోడ్లపై వాహనాలను తోలుతున్నారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ తో ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు. తాజాగా పూణే- షోలాపూర్ హైవే పై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఘోరమైన యాక్సిడెంట్
వివరాల్లోకి వెళితే.. పూణే నుంచో షోలాపూర్ వైపు వేగంగా వెళ్తున్న టెంపో అదుపు తప్పి.. మధ్యలో ఉన్న డివైడర్ మీదుగా దూసుకెళ్లింది. అంతేకాదు అదే సమయంలో అటువైపు దారిలో ఎదురుగా వస్తున్న మరో టెంపోను నేరుగా ఢీకొట్టింది. దౌండ్ తాలూకా పరిధిలోని వఖారి గ్రామం వద్ద శనివారం సాయంత్రం జరిగింది. తరచుగా ప్రమాదాలు జరిగే వకడ బ్రిడ్జి సమీపంలో ఈ ప్రాంతం ఉంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ఫుటేజ్ చూస్తుంటే ఎదురుగా వస్తున్న టెంపో డ్రైవర్ కి ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఏ మాత్రం లేనట్లు కనిపించింది. క్షణాల్లోనే యాక్సిడెంట్ జరిగిపోయింది.
శనివారం మధ్యాహ్నం పుణె-సోలాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సీసీటీవీలో నమోదైంది.
— RTV (@RTVnewsnetwork) September 28, 2025
అదుపుతప్పిన ఒక టెంపో, ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు మరణించారు.#Sholapur#Pune#HighWay#Accident#RTVpic.twitter.com/NI9EX3RmBK
ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. బలంగా ఢీకొట్టుకోవడంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ యాక్సిడెంట్ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులను, బాటసారులను ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడానికి గల కారణమేంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాదకర ఘటన మరోసారి పూణె-షోలాపూర్ హైవేపై రోడ్డు భద్రత గురించి ఆందోళనలను పెంచింది. అధికారులు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన పర్యవేక్షణ చర్యలను అమలు చేయాలని భావిస్తున్నారు.