Pakistan: యుద్ధానికి ప్రధాని ఫుల్ పర్మిషన్..పాకిస్తాన్ కు మొదలైన దడ

పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ప్రస్తుతం ఇవి తారస్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు నిన్న ప్రధాని మోదీ భారత సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ లో భయం మొదలైంది. 

New Update
pak

Atullah Tarar, pakistan information minister

భారత్ యుద్ధానికి సిద్ధమైంది. పహల్గామ్ గ్రదాికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో నిన్న త్రివిధ దళాలతో సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ సైన్యానికి ఫుల్ పవర్స్ ఇస్తున్నట్టు ప్రకటించారు. దీని ప్రభావం అప్పుడే పాకిస్తాన్ లో కనిపిస్తోంది. మోదీ ప్రకటన చేసిన కొంతసేపటిలోనే పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల్లా తరార్ తన ఎక్స్ ఖాతాలు యుద్ధానికి సంబంధించి పోస్ట్ చేశారు. భారత్ రానున్న రెండు, మూడు రోజుల్లో పాకిస్తాన్ పై దండెత్తబోతోందని...తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని అన్నారు. 

మాకు తెలుసు భారత్ కావాలనే యుద్ధానికి వస్తోంది..

పాక్ సమాచార మంత్రి అతుల్లా తరార్ ఇదే పోస్ట్ లో తన భయాన్ని కూడా వ్యక్తం చేశారు. భారత్ నిష్పాక్షిక దర్యాప్తు చేయకుండా యుద్ధానికి కాలు దువ్వుతోందని ఆయన ఆరోపించారు. ఇది ఇరు దేశాల శాంతిని భగ్నం చేస్తుందని నీతి వాక్యాలు పలికారు. పహల్గామ్ దాడిపై తమ ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులతో కూడిన దర్యాప్తును ప్రతిపాదించిందని...దానిని భారత్ అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. భారత్ కావాలనే యుద్ధాన్ని చేస్తోందని అతుల్లా తరార్ విమర్శించారు. మరోవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మొమహ్మద్ రాయిటర్స్ తో మాట్లాడుతూ యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మేము హై అలర్ట్‌లో ఉన్నామని, భారతదేశం దాడి చేస్తే, మేము ప్రతిస్పందిస్తాము అని అన్నారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను వాడడానికి కూడా వెనుకాడమని అన్నారు. 

today-latest-news-in-telugu | attack in Pahalgam

Also Read: Pahalgam Attack: పహల్గామ్ దాడి...భారత్ కు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ వార్నింగ్

Advertisment
తాజా కథనాలు